Overnight Star Heros And Directors In Tollywood: సినిమా రంగంలో హీరోకు అయినా లేదంటే డైరెక్టర్‌కు అయినా సరే ఒక్క సినిమా లైఫ్ ఇస్తుంది. ఆ మూవీతోనే వారు ఇండస్ట్రీలో స్టార్లుగా అవతరిస్తారు. ఆ సినిమానే వారి మార్కెట్‌ను అమాంతం పెంచేస్తుంది. లెక్క లేనన్ని రికార్డులను వారి పేర్ల మీద నమోదయ్యేలా చేస్తుంది. అలా హీరోలకు, డైరెక్టర్లకు మార్కెట్‌ను అమాంతం పెంచేసిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.
చిరును స్టార్ హీరోగా మార్చడమే కాకుండా.. డైరెక్టర్ కోదండరామిరెడ్డిని కూడా స్టార్ డైరెక్టర్ గా మార్చిన మూవీ ఖైదీ. ఈ మూవీతో చిరు మెగాస్టార్ అయ్యాడు. కోదండరామిరెడ్డి టాప్ డైరెక్టర్ అయ్యాడు, ఈ మూవీతోనే పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్ గా మారారు. ఇక పవన్ కెరీర్‌ను, డైరెక్టర్ కరుణాకరన్ కెరీర్‌ను మలుపు తిప్పిన మూవీ తొలిప్రేమ. ఈ మూవీతో పవన్‌కు మంచి మార్కెట్, కరుణాకరన్‌కు చాలా అవకాశాలు పెరిగాయి.
నాగార్జునకు మాస్ ఇమేజ్‌ను డైరెక్టర్‌గా ఆర్జీవీని నిలదొక్కుకునేలా చేసిన మూవీ శివ. ఈ మూవీ అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టి.. కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీతో ఈ ఇద్దరూ స్టార్లు అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్-వివి వినాయక్ కెరీర్‌ను మలుపు తిప్పిన మూవీ ఆది. ఈ మూవీతో ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో స్టార్లుగా మారిపోయారు.
Also Read: బాక్సాఫీస్ పై మెగా – నందమూరి తుఫాన్
మహేశ్ బాబు అప్పటి వరకు ఆవరేజ్ హీరోగానే ఉన్నాడు. కానీ స్టార్ హీరో కాలేదు. డైరెక్టర్ గుణశేఖర్ కూడా యావరేజ్ డైరెక్టర్‌గానే ఉన్నాడు. ఈ సమయంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ ఒక్కడు. ఈ సినిమా సంచలన విజయం సాధించి ఈ ఇద్దరినీ ఓవర్ నైట్ స్టార్లను చేసేసింది. ఇక బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
గంగోత్రితో నటుడిగా గుర్తింపు పొందా తప్ప హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు రాలేదు బన్నీకి. అటు సుకుమార్‌కు కూడా అంతే. అయితే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య మూవీ ఇద్దరి కెరీర్‌ను మార్చేసింది. అప్పట్లో సంచలన విజయం నమోదు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ఇద్దరూ స్టార్లు అయిపోయారు.
విజయ్ దేవర కొండ, సందీప్ రెడ్డిలను స్టార్లుగా మార్చిన మూవీ అర్జున్ రెడ్డి. అంతకు ముందు ఈ ఇద్దరూ ఓ మోస్తరుగానే గుర్తింపు పొందారు. ఇక రాజమౌళికి, ఎన్టీఆర్‌కు లైఫ్ ఇచ్చిన మూవీ సింహాద్రి. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఈ ఇద్దరినీ ఒక్క సారిగా స్టార్లను చేసేసింది. ప్రభాస్ స్టార్ హీరోగా, రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు.
కానీ ఇండియా వ్యాప్తంగా వారిని స్టార్లుగా మార్చేసిన మూవీ బాహుబలి. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇద్దరి పేర్లు మార్మోగిపోయాయి. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ ఇద్దరికీ బాహుబలి క్రేజ్ తీసుకువచ్చింది.
Also Read: ఏ స్టార్ కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?