Highest Grossing Telugu Films In USA: తెలుగు సినిమాలకు యూఎస్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఓవర్సీస్ లో ఇతర భాషల సినిమాలను మించి మన టాలీవుడ్ మూవీలు వసూళ్లు రాబుతున్నాయి. కాగా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోటాలో మొదటి స్థానంలో నిలిచింది బాహుబలి-2. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్లు రాబట్టింది.

రెండో స్థానంలో పవన్ మూవీ అజ్ఞాతవాసి నిలిచింది. డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓవర్సీస్ లో 1.51 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చిన బాహుబలి-1 ఈ కోటాలో 3వ స్థానంలో నిలిచింది. ఓవర్సీస్ లో 1.36 మిలియన్ డాలర్లు రాబట్టింది. చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 కూడా ఓవర్సీస్ లో 1.29 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.
Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

వీటి తర్వాత మహేశ్ బాబు నటించిన స్పైడర్ మూవీ 1 మిలియన్ డాలర్లు రాబట్టి ఓవర్సీస్ లో సత్తా చాటింది. అయితే ఈ మూవీ కూడా తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ కూడా ప్రీమియర్స్ ద్వారా 904K డాలర్లను రాబట్టింది. వీటి తర్వాత స్థానంలో మహేశ్ మూవీ భరత్ అను నేను నిలిచింది. ఈ సినిమా 850K డాలర్లు కొల్లగొట్టింది.

దీని తర్వాత మళ్లీ ప్రభాస్ నటించిన సాహో మూవీ నిలిచింది. ఈ మూవీ ఓవర్సీస్ లో 850K డాలర్లు రాబట్టింది. దీని తర్వాత చిరు మూవీ సైరా నరసింహా రెడ్డి 815 K మిలియన్ డాలర్లు, బన్నీ మూవీ అల వైకుంఠపురములో 809 K డాలర్లు కొల్లగొట్టాయి. వీటన్నింటి తర్వాత నందమూరి హీరో ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత 797 K డాలర్లు రాబట్టింది.

ఇక మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూఈ 763K డాలర్లు ప్రీమియర్స్ ద్వారా వసూలు చేసి 12వ స్థానంలో నిలబడింది. పవన్ మూవీ భీమ్లా నాయక్ కూడా 750K డాలర్లు కొల్లగొట్టింది. ఇలా యూఎస్ లో మన తెలుగు తిరుగులేని రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్లాప్ టాక్ వచ్చినా కూడా.. అక్కడ మాత్రం తిరుగులేని వసూళ్లు రాబడుతున్నాయి.
Also Read: రామ్ సినిమాలో జాన్వీ కపూర్ ?