https://oktelugu.com/

Malli Pelli OTT: ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం స్ట్రీమింగ్ ని ఆపేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ..కారణం అదే!

అందుకే ఆ నెగటివిటీ ని క్యాష్ చేసుకోవడానికి ఆయన పవిత్ర తో తన ప్రేమ వ్యవహారం ఎలా మొదలైంది అనే దానిపై 'మళ్ళీ పెళ్లి' అనే ఒక సినిమాని తీసి రీసెంట్ గానే విడుదల చేసాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలైంది. ఈ చిత్రాన్ని రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీ యాప్స్ లో ఒకేసారి విడుదల చేసారు. రెస్పాన్స్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : July 4, 2023 / 03:53 PM IST

    Malli Pelli OTT

    Follow us on

    Malli Pelli OTT: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నరేష్ మరియు పవిత్ర ప్రేమ మరియు పెళ్లి వ్యవహారం పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ నెగటివిటీ జరిగిందో మన అందరికీ తెలిసిందే. ఆరుపదుల వయస్సు లో పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ నరేష్ పై నెటిజెన్స్ చేసిన కామెంట్స్ మరియు సోషల్ మీడియా లో ఏర్పడిన విపరీతమైన నెగటివిటీ నరేష్ కలలో కూడా ఊహించుకొని ఉండదు.

    అందుకే ఆ నెగటివిటీ ని క్యాష్ చేసుకోవడానికి ఆయన పవిత్ర తో తన ప్రేమ వ్యవహారం ఎలా మొదలైంది అనే దానిపై ‘మళ్ళీ పెళ్లి’ అనే ఒక సినిమాని తీసి రీసెంట్ గానే విడుదల చేసాడు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలైంది. ఈ చిత్రాన్ని రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీ యాప్స్ లో ఒకేసారి విడుదల చేసారు. రెస్పాన్స్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది.

    అయితే నరేష్ మూడవ భార్య రమ్య తన పరువు కి భంగం కలిగించేలా ఈ సినిమా ఉందని, వెంటనే ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ కోర్టు లో కేసు వేసింది. ఈ కేసు కారణంగానే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించినట్టుగా తెలుస్తుంది. తెలుగు తో పాటుగా కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ ని కూడా నిలిపివేశారు. కానీ ఆహా మీడియా లో మాత్రం ఈ సినిమా ఇంకా స్ట్రీమింగ్ అవుతూనే ఉంది.

    అక్కడ కూడా త్వరలోనే ఆపేసి ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని సుమారుగా 17 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించాను అని ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు నరేష్. కానీ థియేట్రికల్ రన్ పరంగా ఈ సినిమాకి వచ్చిన షేర్ ఏమి మిగలలేదు. కానీ ఓటీటీ పరంగా అయినా లాభాలు వస్తుంది అనుకుంటే చివరికి ఇలా అయ్యింది. ఇది నరేష్ కి నిజంగా పెద్ద కోలుకోలేని షాక్ అనే చెప్పాలి.