Puri Jagannath : పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరో రెడీ.. కానీ నో చెప్పిన పూరి… కారణం ఏంటంటే..?

మళ్ళీ తెలుగు డైరెక్టర్ తో చేస్తేనే భారీ హిట్ దక్కుతుందని భావిస్తున్నాడు. మరి ఆయనతో సినిమా తీసి సక్సెస్ చేసే తెలుగు డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే...

Written By: Gopi, Updated On : January 22, 2024 8:50 pm
Follow us on

Puri Jagannath : ప్రస్తుతం తెలుగు సినిమాల హవా పాన్ ఇండియా రేంజ్ లో నడుస్తోంది. వరుసగా తెలుగు సినిమా డైరెక్టర్లు బాలీవుడ్ జనాలను ఆకర్షిస్తూ మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి తెలుగు హీరోగాని, డైరెక్టర్ గానీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇక తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు.

ఇక ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రన్బీర్ కపూర్ అనిమల్ సినిమాలో నటించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. 900 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలీవుడ్ హీరోలు నటించడానికి అసక్తి చూపిస్తున్నారు.ముఖ్యం గా షాహిద్ కపూర్ పూరి తో ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ పూరి మాత్రం షాహిద్ తో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పూరి రామ్ తో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవితో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో బాలీవుడ్ హీరోలను పెట్టుకుంటే చిరంజీవితో సినిమా చేయలేడు కాబట్టి బాలీవుడ్ హీరోలను దూరం పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలీవుడ్ హీరోలు మాత్రం తెలుగు డైరెక్టర్లు ఎవరు దొరికినా వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే డైరెక్టర్ల కథలను వినడానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక అందులో భాగం గానే పూరి దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పండి అని షాహిద్ కపూర్ నుంచి పూరికి కాల్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.

కానీ పూరి మాత్రం ప్రస్తుతానికి తన దగ్గర షాహిద్ కపూర్ ఇమేజ్ కి సరిపడా కథలు లేవని చెప్పడంతో షాహిద్ కపూర్ కొద్దివరకు నిరాశ చెందినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే షాహిద్ కపూర్ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో కబీర్ సింగ్ అనే సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఆయనకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అలాంటి భారీ హిట్ ఇంకొకటి పడలేదు. కాబట్టి మళ్ళీ తెలుగు డైరెక్టర్ తో చేస్తేనే భారీ హిట్ దక్కుతుందని భావిస్తున్నాడు. మరి ఆయనతో సినిమా తీసి సక్సెస్ చేసే తెలుగు డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…