Matka Teaser: మెగా హీరో వరుణ్ తేజ్ కి సరైన హిట్ పడి చాలా కాలం అవుతుంది. 2019లో విడుదలైన ఎఫ్ 2 చిత్రంతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టాడు. వెంకటేష్ తో కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అదే ఏడాది గద్దలకొండ గణేష్ పేరుతో ఓ చిత్రం చేశాడు. అది ఓ మోస్తరు విజయం నమోదు చేసింది. తర్వాత వరుణ్ కి హిట్ లేదు. ఎఫ్ 3 యావరేజ్ గా నిలిచింది. గాండీవ దారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఈసారి ఆయన కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా మూవీ చేస్తున్నాడు. మట్కా పీరియాడిక్ యాక్షన్ క్రైమ్ డ్రామా. వరుణ్ తేజ్ లుక్స్, గెటప్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. క్రైమ్ వరల్డ్ కి డాన్ గా వరుణ్ తేజ్ అలరించాడు. టీజర్ తో కథపై ఒక అవగాహన వచ్చింది. మంచో చెడో… డబ్బులు సంపాదించడమే హీరో లక్ష్యం అని టీజర్ తో స్ఫష్టత వచ్చింది.
ఈ దేశంలో 90 రూపాయలు వందలో ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసలు కోసం 99 మంది కొట్టుకుంటారు. నువ్వు ఆ వందలో ఒకడివి కావాలి. 99 మందిలో ఒకడివి కాకూడదు.. అనే డైలాగ్ తో కూడిన వాయిస్ ఓవర్ అంచనాలు పెంచేసింది. వరుణ్ తేజ్ టీనేజ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు వివిధ గెటప్స్ లో కనిపించాడు. మొత్తంగా మట్కా టీజర్ చూస్తే వరుణ్ తేజ్ కి హిట్ పడటం ఖాయం అనిపిస్తుంది.
మట్కా చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. టీజర్ చూస్తే ఆ కెపాసిటీ ఈ సినిమాకు ఉందనే భావన కలుగుతుంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మట్కా చిత్రానికి జీవి ప్రకాష్ దర్శకుడు. మట్కా మూవీ అక్టోబర్ 14న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ అనడంలో సందేహం లేదు. మట్కా తో వరుణ్ తేజ్ ఏ రేంజ్ హిట్ కొడతాడా చూడాలి..
Web Title: Varun tej matka teaser review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com