https://oktelugu.com/

Imraan Hashmi : తెలుగు సినిమా సెట్స్ లో బాలీవుడ్ హీరోకి ప్రమాదం, కండిషన్ ఎలా ఉందంటే?

నటుడు ఇమ్రాన్ హష్మీ హైదరాబాద్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన G2 షూటింగ్ లో పాల్గొనగా, అపశృతి చోటు చేసుకుంది. ఆయనకు మెడ వద్ద గాయమైంది. దాంతో చిత్ర యూనిట్ ఆందోళన గురయ్యారు.

Written By:
  • S Reddy
  • , Updated On : October 8, 2024 / 11:20 AM IST

    Imraan Hashmi

    Follow us on

    Imraan Hashmi : అడివి శేష్ హీరోగా గూఢచారి 2 (G2) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. G2 లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ ఓ స్టంట్ చేశారు. జంప్ చేసే క్రమంలో మెడకు గాయమైంది. స్వల్ప మొత్తంలో రక్తస్రావం కావడంతో ఆయన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లోతైన గాయం కాదని వైద్యులు తేల్చారట. ప్రాథమిక వైద్యం చేసి పంపారట.

    దాంతో చిత్ర యూనిట్, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇమ్రాన్ హష్మీ గాయాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. G2 యాక్షన్ స్పై డ్రామా. 2018లో విడుదలైన గూఢచారి చిత్రానికి ఇది సీక్వెల్. గూఢచారి మంచి విజయం సాధించింది. జగపతిబాబు, శోభిత దూళిపాళ్ల కీలక రోల్స్ చేశారు.

    G2 చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడు. బనిత సందు, శోభిత ధూళిపాళ్ల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీలో సైతం ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకుడు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

    పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఓజీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇటీవల తిరిగి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓజీ షూటింగ్ సైతం పునఃప్రారంభం కానుందట. తెలుగులో ఇమ్రాన్ హష్మీ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడని చెప్పొచ్చు. బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా ఇమ్రాన్ హష్మీకి పేరుంది.