https://oktelugu.com/

Sara Ali Khan: ఆ విషయంలో మీడియాకి సారీ చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌…

Sara Ali Khan: సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు కనిపిస్తే అభిమానులు, మీడియా మిత్రులు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. కొన్నిసార్లు స్టార్స్ కి అభిమానుల పట్ల అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పలు సంధర్భాల్లో సెలబ్రిటీలు వారి సహనాన్ని కోల్పోయిన సంఘటనలు చాలానే జరిగాయి. ఫ్యాన్స్‌ అని చూడకుండా వారిపై అరుస్తారు, కానీ బాలీవుడ్‌ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్‌ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. అందరికీ నమస్కారం చేస్తూ గౌరవంతో అందరినీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 03:12 PM IST
    Follow us on

    Sara Ali Khan: సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు కనిపిస్తే అభిమానులు, మీడియా మిత్రులు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. కొన్నిసార్లు స్టార్స్ కి అభిమానుల పట్ల అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పలు సంధర్భాల్లో సెలబ్రిటీలు వారి సహనాన్ని కోల్పోయిన సంఘటనలు చాలానే జరిగాయి. ఫ్యాన్స్‌ అని చూడకుండా వారిపై అరుస్తారు, కానీ బాలీవుడ్‌ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్‌ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. అందరికీ నమస్కారం చేస్తూ గౌరవంతో అందరినీ ఆకట్టుకుంది ఈ అమ్మడు. అయితే ఇటీవల జరిగిన ఒక వేడుకలో సారా ప్రవర్తించిన తీరుకి అందరూ అభినందిస్తున్నారు.

    Sara Ali Khan

    Also Read: ఒక్క నైట్ లో జాతకం మారిపోతుందని చెప్తున్న రకుల్ ప్రీత్ సింగ్…

    అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, ధనుష్ నటించిన ‘ఆత్రంగి రే’  సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీని అర్థమైపోతుంది. అయితే “ఆత్రంగి రే’లోని చక్‌ చక్‌” పాటను లాంచ్‌ చేయడానికి ముంబైలోని మిథిబాయి కాలేజ్‌ ఫెస్ట్ ‘క్షితిజ్‌’ కు హాజరయింది సారా. వేడుక అనంతరం అక్కడినుంచి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒక ఫొటోగ్రాఫర్‌ను నెట్టివేసినట్టున్నారు. అది గమనించిన సారా కారు ఆపి ఎవరిని కిందకు తోసారు అని సెక్యురిటీ గార్డ్స్‌ను ప్రశ్నించింది.

    దానికి వారు ఎవరూ కింద పడలేదు అని సమాధానం ఇచ్చారు. దానికి ‘లేదు లేదు, మీరు నెట్టేసిన అతను అ‍ప్పటికే వెళ్లిపోయాడు. అని సెక్యూరిటీ గార్డ్స్‌ని తిరిగి నిలదీసింది. అనంతరం కారు ఎక్కుతూ ఫొటోగ్రాఫర్స్‌తో ‘సారీ చెప్తున్నా, థ్యాంక్యూ’ అని చెప్పింది. అలాగే సెక్యూరిటీ గార్డ్స్‌తో ‘ఇలా ప్రవర్తించవద్దు అని చెప్పింది.

    Also Read: ‘పూజా హెగ్డే’ బికినీనే నమ్ముకుంటున్న త్రివిక్రమ్ !