Priyanka Chopra: రాత్రి వేళ నా బాల్కనీలో కుర్రాడు, మా నాన్న షాక్… ప్రియాంక చోప్రా టీనేజ్ లో అలా చేసిందా!

ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించారు. ఐదారేళ్లుగా ఆమె హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. లాస్ ఏంజెల్స్ లో ఉంటూ ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్లలో నటిస్తున్నారు.

Written By: Shiva, Updated On : May 4, 2023 8:29 am
Follow us on

Priyanka Chopra: హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. తన టీనేజ్ లో జరిగిన విషయాలు వెల్లడించారు. ప్రియాంక చోప్రాను వాళ్ళ నాన్న 12 ఏళ్ల వయసులో అమెరికా పంపారట. నాలుగేళ్లు అమెరికాలో చదువుకున్న ప్రియాంక తిరిగి ఇండియా వచ్చారట. ఈ నాలుగేళ్లలో తన కల్చర్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయట. జుట్టు ఊడి లుక్ కూడా ఛేంజ్ అయ్యిందట. ఇండియాలో తాము నివాసం ఉంటున్న నగరంలో ఒక స్కూల్ లో జాయిన్ చేశారట. ప్రతి రోజూ ప్రియాంకను కొందరు కుర్రాళ్లు ఫాలో అయ్యేవారట. ఇంటి వరకు వచ్చేవారట.

ఓ కుర్రాడు రాత్రివేళ నేరుగా ప్రియాంక చోప్రా బాల్కనీలోకి వచ్చేశాడట. అతన్ని చూసి ప్రియాంక భయంతో వాళ్ళ నాన్న దగ్గరకు పరుగు తీసిందట. దీంతో షాక్ అయిన ప్రియాంక ఫాదర్ ఆమె గది కిటికీలు మూయించాడట. ఆ రోజు నుండి ఆమెకు ఆంక్షలు పెట్టాడట. జీన్స్ ధరించవద్దన్నారట. ఒంటరిగా ఎక్కడికీ పంపేవాడు కాదట. తోడుగా ఒక వ్యక్తిని పంపేవారట. ఆ రోజు నాన్న ఎందుకు అలా చేశారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.

ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించారు. ఐదారేళ్లుగా ఆమె హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. లాస్ ఏంజెల్స్ లో ఉంటూ ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్లలో నటిస్తున్నారు. ఆమె బాలీవుడ్ కి దూరం కావడానికి కారణం ఇటీవల వెల్లడించారు. పరిశ్రమలో కొందరు ఆమెకు అవకాశాలు రాకుండా చేశారట. ఈ క్రమంలో గొడవలు జరిగాయట. అక్కడి పాలిటిక్స్ నచ్చకే హిందీ పరిశ్రమను వదిలేశానని ప్రియాంక చోప్రా వెల్లడించారు.

అమెరికన్ నటుడు అండ్ సింగర్ నిక్ జోనాస్ ప్రియాంక చోప్రా 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్ ఆమె కంటే పదేళ్లు చిన్నవాడు. ప్రియాంక సరోగసీ పద్దతిలో ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ప్రియాంక చోప్రా లేటెస్ట్ ప్రాజెక్ట్ సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ యాక్షన్ సిరీస్లో ప్రియాంక బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యానని ప్రియాంక చెప్పుకొచ్చారు.