https://oktelugu.com/

Anasuya Bharadwaj: హీరోలు గిల్లితే గిల్లిచ్చుకోవాలి… పాపం అనసూయను వదల్లేదా! ఓపెన్ గా చెప్పేసింది!

తాజాగా పరిశ్రమలో హీరోయిన్స్ పరిస్థితిని ఉద్దేశిస్తూ అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం అందుతుంది. ఓ మీడియా కథనం ప్రకారం అనసూయ చిత్ర పరిశ్రమలో హీరోల డామినేషన్ ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 4, 2023 / 08:11 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా అనసూయకు పేరుంది. ఒకప్పటి ఈ జబర్దస్త్ యాంకర్ నటిగా మారిన తెలిసిందే. ఇక మనసులో ఉన్నది ఏదైనా కుండబద్దలు కొట్టడం అనసూయ స్టైల్. తప్పనిపిస్తే ఎంతటి వారినైనా ప్రశ్నిస్తుంది. కెరీర్ కి ఇబ్బంది అవుతుందేమో అని కూడా వెనుకాడదు. అర్జున్ రెడ్డి మూవీలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ మీద ఆమె అభ్యంతరం చెప్పారు. మాదర్*** అని తల్లిని తిడుతూ హీరో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ మీద ఆమె అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రేమ పేరుతో అమ్మాయిని కొట్టడం, లిప్ కిస్సులకు వ్యతిరేకంగా మాట్లాడారు.

    ఇటీవల లైగర్ పరాజయం మీద మరోసారి గత వివాదాన్ని అనసూయ తవ్వారు. ఈ విషయంలో ట్రోల్స్ కి గురయ్యారు. ఇక తన బట్టల మీద ఎవరైనా కామెంట్స్ చేస్తే ఆమెకు నచ్చదు. నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటా? మీకు ఇబ్బంది ఏంటని? ఆమె నేరుగా చెబుతారు. తన డ్రెస్సింగ్ మీద కామెంట్ చేసిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావును కూడా ఆమె వదల్లేదు. అతనికి దారుణమైన కౌంటర్లు ఇచ్చింది.

    తాజాగా పరిశ్రమలో హీరోయిన్స్ పరిస్థితిని ఉద్దేశిస్తూ అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం అందుతుంది. ఓ మీడియా కథనం ప్రకారం అనసూయ చిత్ర పరిశ్రమలో హీరోల డామినేషన్ ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘అందరూ హీరోలను దృష్టిలో ఉంచుకునే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్స్ కేవలం హీరోలతో రొమాన్స్ చేయడానికే వాడుతున్నారు. హీరో-హీరోయిన్ క్యారెక్టర్స్ లో వ్యత్యాసాలు ఉన్నాయి. హీరోలు గిల్లితే గిల్లించ్చుకోవాలి నొక్కితే నొక్కించుకోవాలి. అంతకు మించి హీరోయిన్స్ పాత్రలకు ప్రాధాన్యత ఉండటం లేదని, అసహనం వెళ్లగక్కారు.

    అనసూయ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అనసూయ కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే హీరోల పక్కన హీరోయిన్ గా కాదు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ తరహా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె దర్జా చిత్రంలో లీడ్ రోల్ చేశారు. వాంటెడ్ పండుగాడ్ మూవీలో కూడా ఆమెది ప్రధాన పాత్ర. ఇక హీరోలను, పరిశ్రమను ఉద్దేశించి అనసూయ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక ఉద్దేశం, ఆమె మేల్ డామినేషన్ ని వ్యతిరేకించడమే. ప్రస్తుతం అనసూయ విమానం, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తున్నారు.