Chikoti Praveen Arrested: చికోటి ప్రవీణ్ లెక్క వేరే ఉంది… అది మధ్యలోనే బెడిసి కొట్టింది… లేకుంటే నా?

ప్రవీణ్ గుట్టు మొత్తం థాయిలాండ్ పోలీసులు సీజ్ చేసిన లాగ్ బుక్స్ లో ఉంది. ఆ నాలుగు రోజులు జూదం ద్వారా జరిగిన లావాదేవీల విలువ 500 కోట్ల దాకా ఉంటుంది. అక్కడి పోలీసులు సీజ్ చేసిన 40 దాకా లాగ్ బుక్స్ లో మొత్తం వివరాలు ఉన్నాయి.

Written By: Bhaskar, Updated On : May 4, 2023 8:33 am
Follow us on

Chikoti Praveen Arrested: థాయిలాండ్ లో అక్రమంగా క్యాసినో నిర్వహిస్తున్నందుకు చికోటి ప్రవీణ్ ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత తనకున్న బలంతో ప్రవీణ్ విడుదలయ్యాడు. నేడు రేపు ఇండియాకు రాబోతున్నాడు.. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. అని ప్రవీణ్ అక్కడికి వెళ్ళింది క్యాసినో కు మాత్రమే కాదు.. అంతకుమించి వ్యవహారాలు నడిపేందుకు.. మధ్యలో పోలీసులకు చిక్కిపోయాడు గాని.. లేకుంటే వందల కోట్లు వెనకేసేవాడే.. ఇంతకీ ప్రవీణ్ ప్లాన్ ఏంటి? దీని వెనుక ఉంది ఎవరు? ఇప్పుడు ఇవి చర్చనీయాంశంగా మారిన ప్రశ్నలు.

లాగ్ బుక్స్ లోనే అంతా

ప్రవీణ్ గుట్టు మొత్తం థాయిలాండ్ పోలీసులు సీజ్ చేసిన లాగ్ బుక్స్ లో ఉంది. ఆ నాలుగు రోజులు జూదం ద్వారా జరిగిన లావాదేవీల విలువ 500 కోట్ల దాకా ఉంటుంది. అక్కడి పోలీసులు సీజ్ చేసిన 40 దాకా లాగ్ బుక్స్ లో మొత్తం వివరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి క్యాసినో లో ఒక్క రౌండ్ కు 20 కోట్ల మీద పందెం కడతారని సమాచారం.. ఈ చీకటి క్యాసినో లావాదేవీలపై ఈడీ ఇప్పటికే నిఘా పెట్టింది. థాయిలాండ్ పోలీసులను సంప్రదించింది. లాగ్ బుక్స్ ను తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మధ్యలో గుడివాడ

థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు 16 మంది ఉన్నారు. వీరిలో గుడివాడ, హనుమాన్ జంక్షన్, కైకలూరు, గన్నవరం, ముదినేపల్లి మండలాల చిన్నవారు ఉన్నారు. చీకోటి ప్రవీణ్ గ్యాంగ్ గుడివాడకు చెందిన తిరుమల్ రావు ఈ ప్రాంతానికి చెందిన వారిని థాయిలాండ్ తీసుకెళ్లాడు. అంతేకాదు ప్రవీణ్ ముఠా 2022 సంక్రాంతి సందర్భంగా గుడివాడలో భారీ ఎత్తున క్యాసినో నిర్వహించింది. ఆ పరిచయాలతోనే గుడివాడ, కైకలూరు ప్రాంతానికి చెందిన జూదగాల్లో థాయిలాండ్ వెళ్లారు. ఆ దేశంలో ఉపయోగించిన పరికరాలు మొత్తం భారత్ నుంచి దిగుమతి చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కోవిడ్ వీటిని తెప్పించగా, స్థానిక పోలీసులకు 60 లక్షల రూపాయలు లంచం గా ఇచ్చారు. అయితే గ్యాంబ్లింగ్ అనేది థాయిలాండ్ లో చట్ట విరుద్ధం. వాస్తవానికి గత నెల 24న కూడా ఒక భారతీయ బృందం హోటల్లో దిగింది. తర్వాత వారు సైట్ సియింగ్ కు వచ్చారు.. 27న వచ్చిన బృందం మాత్రం క్యాసినో ఆడింది.

తెర వెనుక పెద్దలు

అయితే ప్రవీణ్ 500 కోట్ల వ్యాపారం చేసేందుకు థాయిలాండ్ వెళ్ళాడు. అక్కడికి వెళ్లేందుకు అతడికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది అధికార పార్టీ నాయకులు సహకరించారని తెలుస్తోంది. గతంలో తన ఫామ్ హౌస్ లో అతడు జంతువులు పెంచుకునేందుకు ఈ ప్రజాప్రతినిధులే సహాయం చేశారు. ఇప్పటివరకు అటవీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ప్రవీణ్ పలు రకాల జంతువులను తన ఫామ్ హౌస్ లో పెంచుతున్నాడు.. దీనిపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి కేసు నమోదు కాకపోవడం విశేషం.. మరోవైపు ప్రవీణ్ ను గ్యాంబ్లింగ్ కేసు నుంచి త్వరగా బయటపడేసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి కొంతమంది కీలక ప్రజాప్రతినిధులు థాయిలాండ్ కు ఫోన్ చేశారు. ప్రవీణ్ కు త్వరగా బెయిల్ వచ్చేలా చేశారు.. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో కొంతమందికి ఎన్నికల ఖర్చు సర్దుబాటు చేసేందుకు ప్రవీణ్ ఈ ఎత్తుగడకు తెరతీసాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ప్రవీణ్ ఊదంతం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రవీణ్ ఇప్పటివరకు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్క మాట కూడా థాయిలాండ్ పోలీసులతో చెప్పకపోవడం విశేషం.