Agniveer Notification: నిరుద్యోగులకు శుభవార్త. అగ్ని వీర్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు సికింద్రాబాద్లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి గాను ఫైర్ మెన్ ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్చి 22 వరకు దరఖాస్తుల గడువు ఉంది. ఏప్రిల్ 22 నుంచి నియామక ప్రక్రియకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈవెంట్ లో తోపాటు వైద్య పరీక్షలు చేపడతారు. ఎంపికైన వారు నాలుగేళ్లపాటు ఇండియన్ ఆర్మీలో ఫైర్ మెన్ గా పని చేయాల్సి ఉంటుంది.
అగ్ని వీర్ జనరల్ డ్యూటీ,టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, ట్రేడ్ మాన్ విభాగంలో ఈ పోస్టుల నియామకం ఉంటుంది. అగ్ని వీర్ జనరల్ డ్యూటీ పోస్టుకు కనీసం పదో తరగతిలో 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఐటిఐ కూడా ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి. ట్రేడ్ మెన్స్ కి మాత్రం పదో తరగతి ఉంటే చాలు. 17న్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
శారీరక ప్రమాణాలకు సంబంధించి ఎత్తు 166 సెంటీమీటర్లు, మరికొన్ని పోస్టులకు 162 సెంటీమీటర్లు సరిపోతుంది. ఎత్తుకు తగిన బరువు ఉండాలి. దరఖాస్తు రుసుము రూ.250. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధిస్తే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తో పాటు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. అగ్ని వీర్ గా ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు ఆర్మీలో సేవలు అందించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.33,000, మూడో ఏడాది నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 జీతం ఉంటుంది.