Best Financial Scheme: డబ్బు మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. జీవితం ఛిన్నాభిన్నం కాకుండా ఉండాలంటే అవసరాలకు నగదును అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రోజూవారీ ఖర్చులకే కాకుండా భవిష్యత్ లో ఎలాంటి కష్టం ఉండకూడద్దనుకుంటే ఎంతో కొంత సేవ్ చేయాలి. అయితే ఒక ప్రణళిక ప్రకారంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. ప్రస్తుతం సంపదను వృద్ధి చేసుకోవడానికి కొత్త కొత్త పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఆయా అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటూ పోవడం వల్ల భవిష్యత్ లో ఎలాంటి అవసరాలున్నా తీరిపోతాయి. అయితే అతి తక్కువ పెట్టుబడులు పెట్టినా లాంగ్ టర్మ్ తీసుకుంటే ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. రూ.500 లోపు ఇన్వెస్ట్ చేసినా మంచి ఫలితాలొచ్చే పథకాలు ఉన్నాయి. అలాంటి స్కీంలు ఏంటంటే?
నేటి కాలంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో డబ్బు సేవ్ చేయడం కష్టంగా మారతుుంది. ఇలాంటి సమయంలో ఉన్నదాంతో ఒక ప్రణాళిక ప్రకారంగా పెట్టుబడులు పెట్టడం వల్ల రిటర్న్స్ బాగుంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్ లో అవసరాలకు ఉపయోగపడుతాయి. వీటిలో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి లాంటి స్కీంలు ప్రధానగా చెప్పుకోవచ్చు. వీటిల్లో తక్కువ మొత్తంలో పెట్టుబడు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
రికరింగ్ డిపాజిట్(ఆర్డీ):
ఇది పోస్టాఫీసు పథకం ఇందులో రూ.100 నుంచి కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా 5 సంవత్సరా వరకు కచ్చితంగా ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. ఈ కాలంలో 6.7 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్లలో 35,681 రిటర్న్ వస్తాయి. అయితే రూ. 100 కంటే ఎక్కువగా కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన:
ఆడపిల్లల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంలో రూ.250 నుంచి ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. దీనికి 8.2 వడ్డీ వస్తుంది. ఇలా 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ మెంట్ చేయాల్సి ఉంటుది. 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి 21 సంవత్సరాలకు వీటిని చెల్లిస్తారు. అలా 21 ఏళ్లకు రూ.2,77,103 రిర్న్స్ వస్తాయి. అయితే ఇందులో గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్):
ఇందులో లాంగ్ టర్మ్ లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. రూ.500 నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మొత్తంగా ఇలా 15 సంవత్సరాల పాటు నెలనెలా చెల్లిస్తూ ఉండాలి. ఆ తరువాత మరో 5 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏడాదికి 6,000.. 15 సంవత్సరాలకు 7.1 శాతం వడ్డీతో కలిపి రూ. 1,62,728 వస్తుంది. ఆ తరువాత మరో 5 సంవత్సాలు పొడగించుకుంటే రూ.2,66,332 లక్షలు రిటర్న్ వస్తాయి.