Micromax : ఇప్పుడంటే కొత్త కొత్త మొబైల్ ఫోన్‌లు వచ్చేశాయి. కానీ అప్పట్లో ఎక్కువగా ప్రజలు మైక్రోమ్యాక్స్ (Micromax) ఉపయోగించేవారు. తక్కువ ధరకే.. మంచి ఫీచర్లతో తీసుకురావడంతో దీన్ని వాడేవారు. చైనా నుంచి బ్లూటూత్ వంటి కొత్త ఫీచర్లతో ఓ కొత్త మొబైల్ ఫోన్‌ను తీసుకొచ్చి మైక్రోమ్యాక్స్‌గా విక్రయించారు. దీని ధర కూడా రూ.5000 నుంచి రూ.10000 మధ్య ఉండేది. ఫీచర్లు కూడా బాగుండటంతో చాలా మంది వీటినే కొనుగోలు చేశారు. ఒక్క రోజులో దాదాపుగా 30 వేల మొబైల్స్‌ను మైక్రోమ్యాక్స్ విక్రయించేంది. దీంతో 2014-2015 కాలానికి మైక్రోమ్యాక్స్ భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌గా తయారు అయ్యింది. టాప్ 10 గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. మధ్యతరగతిని ఆకర్షించే ఫీచర్లతో రావడంతో ఇది విజయవంతమైంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దాదాపు 17%ని మైక్రోమ్యాక్స్ సాధించింది. ఆఖరికి శామ్‌సంగ్, నోకియా వంటి ప్రపంచ దిగ్గజాలను అధిగమించింది. అయితే కేవలం స్మార్ట్‌ఫోన్లు కాకుండా.. ఆ కంపెనీ టెలివిజన్లు, టాబ్లెట్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్‌లోకి కూడా ప్రవేశించింది. మేడ్ ఇన్ ఇండియా అనే ఎక్కువ పరికరాలు చేయడంపై దృష్టి పెట్టింది. అయితే ఒక్క రోజులో దాదాపుగా 30 వేల మొబైల్స్ విక్రయించిన మైక్రోమ్యాక్స్ దేశంలో ఎలా కనుమరుగైంది? దీని కథేంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
మైక్రోమ్యాక్స్ చైనా నుంచి మొబైల్స్ తీసుకొచ్చి విక్రయించేది. కానీ ఆ తర్వాత డైరెక్ట్‌గా చైనానే భారతీయ మార్కెట్‌లో మొబైల్స్‌ను విక్రయించేది. దీంతో మైక్రోమ్యాక్స్ తగ్గిపోయింది. దీనికి తోడు చైనా కంపెనీలో అన్ని కూడా 4జీ మొబైల్స్‌ను తీసుకొచ్చాయి. దీంతో మైక్రోమాక్స్ 3జీ కావడంతో ఎక్కువ మంది వాటికే ఇంట్రెస్ట్ చూపించారు. అదే సమయంలో జియో కూడా 4జీ తీసుకొచ్చింది. అలా మైక్రోమ్యాక్స్ కనుమరుగైంది. మైక్రోమ్యాక్స్ మళ్లీ కొత్తగా 4జీ ఫోన్లు తీసుకురావాలంటే.. తన దగ్గర ఉన్న అన్ని 3జీ ఫోన్లు విక్రయించాలి. కానీ అప్పటికే దేశంలో డిమానిటైజేషన్ కావడం వల్ల ప్రజల దగ్గర క్యాష్ లేదు. దీంతో మైక్రోమ్యాక్స్ అలా కనుమరుగైంది. ఆ తర్వాత Xiaomi, Oppo, Vivo వంటి చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు దేశంలో ఎక్కువ అయ్యాయి. అయితే మైక్రోమ్యాక్స్ తన డిమాండ్‌ను పెంచుకోవడానికి కేవలం మొబైల్స్ కాకుండా స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. వీటికి అధిక-నాణ్యత, ఫీచర్లు ఎక్కువగా ఉండేలా చూసుకున్నాయి. ఈ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌లు, సజావుగా స్ట్రీమింగ్ ఎంపికలు, ప్రసిద్ధ యాప్‌లతో ఏకీకరణను అందించేలా డిజైన్ చేశాయి. అలాగే మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్‌ని కూడా తీసుకొచ్చింది. వీటితో పాటు ఓవెన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర స్మార్ట్ వేరబుల్స్‌ను కూడా అందించింది.
మంచి ఫీచర్లతో వచ్చిన కూడా దేశంలో 2016 సమయంలో నోట్ల రద్దు అయ్యింది. దీంతో రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేసింది. ఆ సమయంలో ఎక్కువగా డబ్బులు ఇచ్చి కొనేవారు. అప్పుడు ఆన్‌లైన్‌లో కొనడం ప్రజలకు తెలిసేది కాదు. దీంతో పూర్తిగా కంపెనీ ఆదాయం తగ్గింది. అయితే ఇప్పటికీ మైక్రోమాక్స్ ఉంది. కానీ వాటి ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారిస్తోంది. కానీ మళ్లీ భారత్ మార్కెట్‌లో పుంజుకుంటుందో లేదో చూడాలి.