Director Bobby
Director Bobby : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పటికే స్టార్ ఇమేజ్ ని పొందుతున్న నటులు చాలా మందు ఉన్నారు. ఇక ‘అనిమల్ ‘ (Animal) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ‘బాబి డియోల్’ (Babi deol) ఈ ఒక్క సినిమాతో ఆయనకి ఓవర్ నైట్ లో చాలా మంచి ఇమేజ్ అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇంట్లోనే ఉంటూ తన పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడట… కానీ అనిమల్ సినిమాతో ఒక్కసారిగా తన జాతకం మారిపోయి ఆ సినిమా సక్సెస్ అయిన వెంటనే ఆయనకి 20 సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టుగా ఆయన తెలియజేశారు. రీసెంట్ గా డైరెక్టర్ బాబి యాక్టర్ బాబీ డియోల్ గురించి మాట్లాడుతూ ఆయనను టచ్ చేస్తే చాలు ఎమోషనల్ అయిపోతున్నాడు. ఇక అప్పటిదాకా ఇంట్లో ఉన్న నన్ను సందీప్ రెడ్డి వంగ అనే ఒక తెలుగు దర్శకుడు వచ్చి అనిమల్ సినిమాలో విలన్ గా నన్ను తీసుకొని నా కెరియర్నే మార్చేశాడు అంటూ చెబుతూనే సందీప్ రెడ్డి వంగ విషయాన్ని గుర్తు చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు అంటూ బాబీ చెప్పడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా ఒకప్పుడు హీరోగా రాణించిన బాబీ డియోల్ ఆ తర్వాత కాలంలో సినిమాలు సక్సెస్ అవ్వలేకపోవడం తో ఆఫర్స్ లేక ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకునే పాత్రలో నటిస్తూ ఉండడం విశేషం…
రీసెంట్ గా ‘డాకు మహారాజు’ (daaku Maharaj) సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు. ప్రతి హీరో మంచి అవకాశమైతే అందుకుంటున్నాడు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా కావడం విశేషం…
మొత్తానికైతే బాబీ డియోల్ ఇప్పటికి కూడా తెలుగు దర్శకుడు అనే సందీప్ రెడ్డివంగ లాంటి దమ్మున్న దర్శకుడు బాలీవుడ్ కి వచ్చి నా తలారాతను మార్చేశాడు అంటూ చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి గట్స్ ఉన్న డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ ఇంకా ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…