Ayodhyarami Reddy Resign to YCP
YCP Party : వైసీపీ పార్టీ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పదేళ్ల పాటు మాజీ సీఎం జగన్ తో కలిసి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీ ని వీడి వెళ్లిపోతున్నారు. వై ఎస్ జగన్ పేరు తీస్తే మనకి వెంటనే గుర్తుకు వచ్చే మరో పేరు విజయసాయిరెడ్డి. జగన్ కి మొదటి నుండి కుడిభుజం గా ఉంటూ, పార్టీకి ఎనలేని సేవలు అందించాడు. రెండు నెలల క్రితం కూడా ఆయన మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని భయపడటం అనుకోకండి. 5 సంవత్సరాలలో మళ్ళీ అధికారం లోకి వస్తాం,మధ్యంతర ఎన్నికలు జరిగితే రెండేళ్లలోనే వస్తాం అంటూ ప్రెస్ మీట్ పెట్టిమరీ సవాలు విసిరిన విజయ్ సాయి రెడ్డి, నేడు ఆ పార్టీ కి, రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతానికి ఆయన రాజకీయాలకు దూరం అంటూ చెప్పుకొచ్చిన త్వరలోనే బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయి.
విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేసిన పది నిమిషాల లోపే పార్టీలో నెంబర్ 3 గా పిలవబడే అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేశాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన వచ్చే వారం తన రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆళ్ళ అయోధ్య రామి రెడ్డి 2014 వ సంవత్సరం లో వైసీపీ పార్టీ లో చేరి నర్సరావుపేట ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత అదే స్థానం నుండి 2019 వ సంవత్సరం లో పోటీ చేసి గెలుపొంది పార్లమెంట్ మెంబెర్ అయ్యాడు. 2020 వ సంవత్సరం లో మాజీ సీఎం జగన్ ఈయన్ని రాజ్యసభకు పంపించాడు. ఇప్పుడు ఆయన ఆ పార్టీ నుండి తప్పుకోవడం జగన్ కి చావు దెబ్బ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మొదటి నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఇలాంటోళ్ళు ఆ పార్టీ ని వీడుతుండడం చూస్తుంటే వైసీపీ పార్టీ లో చివరికి రోజా, అంబటి రాంబాబు తప్ప ఎవ్వరూ మిగిలేలా కనిపించడం లేదు. ఒకే ఒక్క ఎన్నిక దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీ గా పిలవబడే వైసీపీ పార్టీ ని కుప్పకూలిపోయేలా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. 2019 వ సంవత్సరం లో తెలుగు దేశం పార్టీ కి, జనసేన పార్టీ లకు కూడా ఇలాంటి ఘోరమైన పరాజయమే ఎదురైంది. కానీ ఆ పార్టీలకు మొదటి నుండి విశ్వాసంగా ఉన్న ముఖ్య నాయకులు ఆ పార్టీలతోనే కొనసాగుతున్నారు. అలాంటిది వైసీపీ పార్టీ లో ఎందుకు జరగడం లేదంటే న్యాయకత్వ లోపమే అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పార్టీ క్యాడర్ మాత్రం అయోమయం లో పడింది. పార్టీ భవిష్యత్తు ఏంటో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.