Vijayasai Reddy
Vijayasai Reddy : వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకొచ్చే ఇద్దరు, ముగ్గురు నాయకులలో ఒకరు విజయ్ సాయి రెడ్డి. పార్టీ ప్రారంభం నుండి మాజీ సీఎం జగన్ కి తోడుగా ఉంటూ, ఆయనతో పాటు కలిసి జైలు జీవితం గడిపిన అతి నమ్మకస్తుడిగా విజయ్ సాయి రెడ్డి కి పేరుంది. గత ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి దారుణ పరాజయం పొందాడు. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీ తరుపున రాజ్యసభ ఎంపీ గా కొనసాగుతున్నాడు. పార్టీ కి అత్యంత కీలకుడిగా వ్యవహరిస్తున్న ఈయన, ఇప్పుడు ఆ పార్టీ కి రాజీనామా చేయడం పెద్ద సంచలనం గా మారింది. కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ ని వేస్తూ ‘రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన రాజీనామా వైసీపీ పార్టీ కి, ఆ పార్టీ కార్యకర్తలకు ఊహించని షాక్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆయన తన ట్వీట్ లో ఏమని వేశాడో ఒకసారి చూద్దాం.
ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ నుండి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నాను. రాజ్య సభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయబోతున్నాను. రాజీనామా చేస్తున్నాను కదా అని వేరే పార్టీ లో చేరే ఉద్దేశ్యం నాకు లేదు. అధికార పక్షం పార్టీ లో చేరి పదువులు, లేదా డబ్బులు సంపాదించాలని నేను కోరుకోవడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, నన్ను ఎవరూ ప్రభావితం చేయడం లేదు. నాలుగు దశాబ్దాల నుండి నన్ను నమ్మి, ఇంతటి వాడిని చేసిన వైఎస్ఆర్ కుటుంబానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను రెండుసార్లు రాజ్యసభకు పంపిన జగన్ గారికి, నా విజయాలకు వెన్నుదన్నుగా నిల్చిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో కష్టపడి పని చేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలాగా వ్యవహరించాను. దాదాపుగా 9 సంవత్సరాలు నన్ను ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధార్యాన్ని ఇచ్చిన ప్రధాని మోడీ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీ తో రాజకీయంగా విభేదించిన విషయం వాస్తవమే, కానీ చంద్రబాబు తో నాకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ సాయి రెడ్డి. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ చెప్పుకొచ్చిన విజయ్ సాయి రెడ్డి, భవిష్యత్తులో కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. హై కమాండ్ ఇచ్చిన ఆదేశాలు మేరకే ఆయన పార్టీ కి రాజీనామా చేసాడని టాక్. ఈమధ్యనే ఆయన పవన్ కళ్యాణ్ పొగుడుతూ వ్యాఖ్యలు చేశాడు. అంటే జనసేన పార్టీ లో చేరే ఉద్దేశ్యం ఆయనకి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి భవిష్యత్తులో ఆయన మార్గం ఎటు వైపో చూడాలి.
బీజేపీ పార్టీ అధిష్టానం విజయ్ సాయి రెడ్డి కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన్ని కేంద్రంలో ఒక ముఖ్యమైన శాఖకి మినిస్టర్ ని చేసే ఆలోచనలో ఉన్నారట. కొన్నాళ్ళు రాజకీయంగా మౌనం వహించి, ఈ ఏడాది చివరి లోపు ఆయన బీజేపీ పార్టీ లో చేరి, కేంద్ర క్యాబినెట్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025