Hari Hara Veera Mallu: బిగ్ బ్రేకింగ్ : ‘హరి హర వీరమల్లు’ గురించి అభిమానులకు చేదు వార్త..నిర్మాత బయట కనిపిస్తే ఫ్యాన్స్ కొట్టేస్తారేమో!

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ పాటకి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి దీపావళి కి ఈ పాట విడుదల కావడం లేదని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Written By: Vicky, Updated On : October 29, 2024 8:54 pm

Producer reacts on the release date of Hari Hara Veera Mallu

Follow us on

Hari Hara Veera Mallu: ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుండి సినిమా విడుదల కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మార్చి 28 వ తారీఖున విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కూడా విరామం లేకుండా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మీద కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన మూవీ టీం,ప్రస్తుతం ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక పాట పాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటని దీపావళి కానుకగా విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కొన్ని విశ్వసనీయ వర్గాలు కూడా ఈ విషయాన్ని తెలిపాయి. పవన్ కళ్యాణ్ తో పాటని రికార్డు చేయించడం కూడా జరిగింది.

కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ పాటకి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి దీపావళి కి ఈ పాట విడుదల కావడం లేదని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 5 ఏళ్ళ నుండి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని, అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు గాడిలో పడిందని, సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ ఆశిస్తే వరదల కారణంగా ఆపించేశారని, ఆ తర్వాత దసరా కి అయినా అప్డేట్ వస్తుందని అనుకుంటే, అది కూడా వదిలేశారని, ఇప్పుడు దీపావళి ని కూడా వదిలేస్తే ఊరుకునేది లేదని మేకర్స్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వార్నింగ్స్ ఇస్తున్నారు. వాస్తవానికి ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ని కేవలం ‘హరి హర వీరమల్లు’ కోసం ఆపారు. ఓజీ నుండి మొదటి పాట విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం మొదట విడుదల అవుతుంది కాబట్టి, ఓజీ టీం తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఆపుకోవాల్సి వచ్చింది.

కానీ ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ టీం ఇలా పని ఆలస్యం అయ్యేలా చేయడం చూసి అసలు ఆ సినిమా మార్చి 28న విడుదల అవుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా దీపావళి కి పాట విడుదల కాకపోయినప్పటికీ, ఆరోజు ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ తో లిరికల్ వీడియో సాంగ్ కి సంబంధించి విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. రేపు దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పోస్టర్ తోనే సంతృప్తి చెందుతారా లేదా అనేది చూడాలి. ఈ నెల 31, లేదా నవంబర్ మొదటి వారంలో ‘హరి హర వీరమల్లు’ కి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అవుతుందట.