Biker Movie 2 Day Box Office: మన టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు లేవు. రాజమౌళి ‘సై’, నాని ‘జెర్సీ’ చిత్రాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ, కలెక్షన్స్ పరంగా యావరేజ్ గా నిల్చింది. అయితే ఈ సెంటిమెంట్ ని శర్వానంద్ తన ‘బైకర్'(Biker Movie) చిత్రం తో బ్రేక్ చేస్తాడని అంతా అనుకున్నారు. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కానీ , కమర్షియల్ గా ఇది పెద్ద డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. మొదటి రోజుల్లో ఈ చిత్రానికి డీసెంట్ వసూళ్లే నమోదు అయ్యాయి, కానీ అవి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం సరిపోవు. ఎందుకంటే శర్వానంద్ మార్కెట్ కి మించి ఈ చిత్రం కోసం బడ్జెట్ పెట్టారు యూవీ క్రియేషన్స్ సంస్థ. ఆ బడ్జెట్ లెక్క దాదాపుగా 45 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.
అయితే విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ (ఓటీటీ + ఆడియో +డబ్బింగ్ రైట్స్) కలిపి 26 కోట్ల రూపాయిల వరకు జరిగిందట. మిగిలిన 19 కోట్ల రూపాయిలు థియేటర్స్ నుండి రాబట్టాలి. ఈ చిత్రానికి థియేట్రికల్ పరంగా జరిగిన వేల్యూ బిజినెస్ 21 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఒక్క ప్రాంతం లో కూడా ఈ చిత్రం అవుట్ రైట్ బేసిస్ లో అమ్ముడుపోలేదు. అడ్వాన్స్ బేసిస్ మీదనే అమ్ముడుపోయింది. కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను దాటాల్సిందే. లేదంటే బయ్యర్స్ కి డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, నాన్ థియేట్రికల్ నుండి వచ్చిన ఆదాయం కూడా పోతుంది. ఇక రెండు రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 2 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
రెండవ రోజున వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట . ఓవరాల్ గా ఈ చిత్రానికి 2 రోజులకు కలిపి 4 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. మొదటి రోజుతో పోలిస్తే ఎలాంటి డ్రాప్స్ లేవు , అలా అని గ్రోత్ కూడా లేదు. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా ఈ చిత్రం అడుగులు వేయడం లేదు. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మొదటి రోజు మొదటి మూడు రోజులకు కలిపి 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అయినా రావాలి. కానీ ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరే లెవెల్ లాంగ్ రన్ ఉంటే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.