Biker vs Rakasa day 2 collections: సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన బ్లాక్ బస్టర్ లేదు. ఎన్నో ఆశలు అంచనాల మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎంతలా అంటే , ప్రీ కోవిద్ ముందు పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాలకు వచ్చినంత కలెక్షన్స్ కూడా ఈ చిత్రానికి రాలేదు. ఇప్పటికే రాజా సాబ్ ఫెయిల్యూర్ తో బయ్యర్స్ పీకల్లోతు నష్టాల్లో ఉన్నారు, ఇలాంటి సమయంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం వాళ్లపై మరింత నష్టాల భారం మోపింది. ఇలా పెద్ద సినిమాలు బయ్యర్స్ ని దారుణంగా దెబ్బ తీస్తున్న సమయంలో , మన టాలీవుడ్ ని చిన్న సినిమాలు ఆదుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఈ సమ్మర్ కానుకగా విడుదలయ్యే ‘బైకర్'(Biker Movie), ‘రాకాస’ (Rakasa Movie) చిత్రాలు కచ్చితంగా భారీ విజయాలు సాధిస్తాయని ఆశతో ఉండేవారు బయ్యర్స్.
వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ ఆ టాక్ కి తగ్గ రేంజ్ లో అయితే లేవు కానీ , పర్వాలేదు , ఈ రెండు సినిమాల్లో ఎదో ఒక సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి మంచి లాభాలను అందుకుంటుంది అనే నమ్మకాన్ని అయితే ఇచ్చింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ‘రాకాస’ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఆఫ్లిన్ టికెట్ సేల్స్ గ్రాస్ ని కూడా కలుపుకొని 6 కోట్ల రూపాయిల వరకు రాబట్టగా, ‘బైకర్’ చిత్రం నాలుగు కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే రెండవ రోజు ఈ రెండు సినిమాల్లో ఏది బలంగా నిల్చింది?, ఏ సినిమా పై చెయ్యి సాధించింది అనేది చూద్దాం.
Also Read: రామ్ చరణ్ తో పోటీ పడే హీరోలు వీళ్లే…
మొదటి రోజు ఓపెనింగ్స్ వరకు అయితే ‘రాకాస’ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ వన్ సైడ్ డామినేషన్ చూపించింది. కానీ రెండవ రోజు ఆ పరిస్థితి లేదు. ‘బైకర్’ చిత్రం నూన్ షోస్ లో అనేక ప్రాంతాల్లో ‘రాకాస’ ని డామినేట్ చేయడం గమనార్హం. బుక్ మై షో టికెట్ సేల్స్ లో కూడా ‘బైకర్’ బాగా పెరిగింది. ‘రాకాస’ చిత్రానికి గంటకు 3500 టిక్కెట్లు అమ్ముడుపోతుండగా, ‘బైకర్’ చిత్రానికి 3000 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ , బెంగళూరు , వైజాగ్ వంటి సిటీస్ లో ‘బైకర్’ చిత్రం డామినేషన్ చూపిస్తుండగా, ‘రాకాస’ చిత్రం మాస్ సెంటర్స్ లో డామినేషన్ చూపిస్తోంది. ఓవరాల్ గా రెండవ రోజు ముగిసే సమయానికి ‘బైకర్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ‘రాకాస’ చిత్రానికి కూడా ఇంచుమించు అదే రేంజ్ గ్రాస్ నమోదు అవుతుందని అంటున్నారు , మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
