Ram Charan competing Heroes: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురు ఎవరు లేరనేంతల తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమా సరైన సక్సెస్ ను సాధించకపోవడంతో తన అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న పెద్ది సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… అయితే రామ్ చరణ్ కి బాలీవుడ్ హీరోల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. తనతో పాటు పోటీపడే హీరోలు ఎవరున్నారు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రన్బీర్ కపూర్, రన్వీర్ సింగ్ లాంటి ఇద్దరు హీరోలు రామ్ చరణ్ కి విపరీతమైన పోటీని ఇవ్వడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ది సినిమాతో వాళ్ళిద్దరిని బీట్ చేసి ముందుకు దూసుకెళ్తే పర్లేదు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు వెనుకబడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది.
‘దురంధర్ 2’ సినిమా రాకముందు వరకు ఇండియాలో తెలుగు సినిమాల హవానే కొనసాగింది. ప్రస్తుతం దురందర్ 2 మూవీ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటి వరకు దురంధర్ 2 మూవీ ‘పుష్ప 2’, ‘బాహుబలి 2’ రికార్డులను ఇప్పటివరకు ఇంకా బ్రేక్ చేయలేదు.
Also Read: మోక్షజ్ఞ చేయబోయే సినిమా కథను ఫైనల్ చేసే బాధ్యతను బాలయ్య ఆ స్టార్ హీరోకి చెప్పాడు…
వాటిని బ్రేక్ చేసే అవకాశం ఉందా? లేదా అనే కోణంలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు కాబట్టి ఇప్పుడు తనను ఢీ కొనేంత శక్తి బాలీవుడ్ హీరోలకైతే లేదు. ముందు ముందు ఏదైనా వస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా వస్తె ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ అవుతాయంటూ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
