https://oktelugu.com/

Mohan Lal : ఏమా అందం.. మోహన్ లాల్ కూతురు ఫొటో లీక్.. చూస్తే తట్టుకోలేరు

తాజాగా మోహన్ లాల్ కూతురు విస్మయ గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. ఇటీవల మోహన్ లాల్ తన కూతురుకు బర్త్ డే విషేష్ చెబుతూ పిక్ ను షేర్ చేశాడు. ఈ సందర్భంగా ‘నా యువరాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, నువ్వు ఎప్పటికీ ప్రేమ, ఆనందంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మెసేజ్ చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2024 / 01:47 PM IST

    Mohan Lal Daughter

    Follow us on

    Mohan Lal : తెలుగు, మలయాళం సినీ ఇండస్ట్రీలకు అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మాలీవుడ్ నుంచి వచ్చిన ఎందరో నటులు తెలుగులో పాపులర్ అయ్యారు. యాంకర్ సుమ వంటి వారు ఇక్కడే సెటిల్ అయ్యారు. కేరళ నుంచి కేవలం హీరోయిన్లు మాత్రమే కాకుండా హీరోలు సైతం కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించి అలరించారు. వీరిలో మోహన్ లాల్ ఒకరు. మోహన్ లాల్ అక్కినేని నాగేశ్వర్ రావు హయాంలోనే గాండీవం సినిమాలో కనిపించి ఆకట్టుకున్నారు. ఆ తరువాత చాన్నాళ్ల తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మెయిన్ రోల్ లో నటించారు. ఇప్పుడు ఆయన కూతురు గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    మోహన్ లాల్ మాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ స్టార్ అని చెప్పవచ్చు. అయితే ఈయన అక్కడికే పరిమితం కాకుండా యావత్ సౌత్ ఇండస్రీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో మోహన్ లాల్ నటనతో విశ్వరూపం చూపించారు. సినిమాల్లో కొనసాగుతున్న సమయంలోనే మోహన్ లాల్ 1998 సంవత్సరంలో సుచిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈమె తమిళ సినిమాల నిర్మాత బాలాజీ కూతురు. ఈ దంపతులకు ప్రణవ్, విస్మయ అనే ఇద్దరు సంతానం.

    తాజాగా మోహన్ లాల్ కూతురు విస్మయ గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. ఇటీవల మోహన్ లాల్ తన కూతురుకు బర్త్ డే విషేష్ చెబుతూ పిక్ ను షేర్ చేశాడు. ఈ సందర్భంగా ‘నా యువరాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, నువ్వు ఎప్పటికీ ప్రేమ, ఆనందంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మెసేజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆము గురించి మోహన్ లాల్ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకంటున్నారు. సాధారణంగా మోహన్ లాల్ తన పర్సనల్ విషయాలను ఎప్పటికీ బయటపెట్టలేదు.ఇన్నాళ్ల తరువాత ఆమె గురించి చెప్పేసరికి ఉబ్బితబ్బయిపోతున్నారు.

    ఇక విస్మయ గురించి వివరాల్లోకి వెళితే.. ఈమె చదువుతో పాటు ఫొటోగ్రఫీలో యాక్టివ్ గా ఉంటుంది. కవిత్వాలు కూడా రాస్తున్నారు. తాజాగా ఆమె ఫొటో షేర్ చేసి ‘సూర్యుడి చుట్టూ మరో కక్ష్య’ అని మెసేజ్ పెట్టింది. అలాగే విస్మయకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఎక్కువగా ప్రయాణాలు చేసిన ఫొటోలను షేర్ చేసింది. అమెరికన్ సింగర్ రాడ్ స్టీవర్డ్ కు విస్మయ వీరాభిమాని.