Naveen Polishetty: సినిమాలంటే పిచ్చితో కొందరు ఎంతో మంచి ఉద్యోగాలను కూడా వదిలేసి వస్తుంటారు. అయితే ఇదే తరహాలో నవీన్ పొలిశెట్టి కూడా మంచి ఉద్యోగాన్ని వదిలేసి వచ్చారు. మరి అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ ను సాధించారా లేదా అంటే.. మంచి సినిమాల్లో నటించారు కానీ స్టార్ హీరోల లిస్ట్ లో చేరలేకపోయారు నవీన్. అయితే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఇంగ్లాండులో మంచి ఉద్యోగం లో స్థిరపడిన నవీన్ ఆ ఉద్యోగంతో హ్యాపీగా లేక నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండియాకు వచ్చేశారు.
అయితే 2012లో మొట్టమొదటిసారి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత ఢీ ఫర్ దోపిడి, వన్ నేనొక్కడినే వంటి చిత్రాల్లో నటించారు. కానీ ఇందులో కూడా చిన్న పాత్రల్లోనే కనిపించారు నవీన్ పొలిశెట్టి. ఇలా చిన్న సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమాతో మొట్టమొదటి సారి మెయిన్ లీడ్ గా నటించి విజయం సాధించారు. అప్పటి నుంచి నవీన్ పొలిశెట్టిని తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోగా గుర్తించడం మొదలు పెట్టింది.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో చిచోరే అనే మరొ సినిమాలో కూడా సహాయక పాత్రలోనే నటించారు నవీన్. ఇక తన మూడో సినిమా జాతి రత్నాలు. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక మంచి కామెడీ చిత్రంగా పేరు సంపాదించింది. అయితే ఈయన హీరోగా వచ్చిన మరో సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. దీని తర్వాత ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఇంత భారీ కెరీర్ లో కేవలం అరడజను వరకు మాత్రమే సినిమాల్లో నటించారు. అయితే ఇంత తక్కువ సినిమాల్లో ఎందుకు నటించారు అనే విషయం తెలుసుకుందాం..
ఈయన చాలా మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. తను సినిమా చూడాలంటే అసలు డబ్బులు ఉండేవి కాదట. ఎవరైనా ఫ్రెండ్స్ సినిమాకు వెళ్తున్నారనే విషయం తెలిస్తే సరిగ్గా అదే సమయానికి వెళ్లి కలిసేవాడట. సినిమాకు వెళ్తున్నాం రారా అంటూ వారు కూడా వెంట తీసుకొని వెళ్లేవారట. సినిమా అంటే ఎంతో ఇష్టం అని.. కానీ చూసే స్తోమత లేకపోవడంతో తాను నటించే సినిమాలు కూడా క్వాలిటీ తో అందరూ చూసేలా తీయాలని నిర్ణయించుకున్నారట. అందుకే ఎక్కువ సినిమాలు చేయకపోయినా ప్రతి సినిమా హిట్ అవ్వాలని.. అందరికీ నచ్చేలా ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట నవీన్ పొలిశెట్టి.