Balayya : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న’అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఆహా మీడియా లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో, ఇప్పుడు నాల్గవ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ నాల్గవ సీజన్ లో ఇప్పటికే 5 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. నారా చంద్రబాబు నాయుడు, సూర్య, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి వారు హాజరయ్యారు. వీరిలో అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి అప్లోడ్ చేసారు. ఆరవ ఎపిసోడ్ కి నవీన్ పోలిశెట్టి, శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసారు. వీళ్లిద్దరు బాలయ్య బాబు తో చేసిన సరదా చిట్ చాట్ చూసే ఆడియన్స్ కి చాలా బాగా అనిపించింది. వీళ్లిద్దరు కలిసి ‘అనగనగ ఒక రాజు’ అనే చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా ఈ ఎపిసోడ్ లో నవీన్ పోలిశెట్టి చేసిన ఫన్ చూసే ఆడియన్స్ కి పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా శ్రీలీల తో ఆయన కల్పిన పులిహోర వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఒక అమ్మాయిని పడేయడం ఎలా అనేది కుర్రాళ్ళు ఈ ఎపిసోడ్ లో నవీన్ పోలిశెట్టి ని చూసి తెలుసుకోవచ్చు. ఈ జంట కూడా చూసేందుకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న చనువు చూస్తుంటే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని, త్వరలోనే వీళ్ళ మధ్య ఎదో జరగబోతుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఇప్పటి నుండే కథలు అల్లేస్తున్నారు. నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ ప్రారంభం అవ్వగానే బాలయ్య బాబు గురించి పలు ఎలివేషన్స్ ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ శ్రీలీల వస్తుంది. ఈమె క్రింద కూర్చొని వీణ వాయిస్తుండగా, నవీన్ పోలిశెట్టి ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ని వీణతో వాయించు అని అంటాడు.
ఇక తర్వాత ఈయన శ్రీలీల చదివే MBBS గురించి చెప్తూ ‘MBBS లో మూడు సంవత్సరాలు ఉంటాయి. మొదటి సంవత్సరంలో కుర్చీ మడతపెట్టి, రెండవ సంవత్సరం లో జింతాక్ చితాక్, మూడవ సంవత్సరం లో కిస్సిక్’ అంటూ ఆయన శ్రీలీల మీద పేల్చిన పంచులు వేరే లెవెల్ లో పేలాయి. ఇలా ఎపిసోడ్ మొత్తం శ్రీలీల ని ఆటపట్టిస్తూనే ఉంటాడు నవీన్. ఇక్కడే ఈ రేంజ్ లో ఉంటే ఇక షూటింగ్ లో ఆమెతో ఏ రేంజ్ లో ఆడుకొని ఉంటాడో మీరే ఊహించుకోండి. ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ అనే చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘మ్యాడ్’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ సాగర్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.