Bigg Boss Voice Change: నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ బాస్ షో మంచి పాపులారిటిని సంపాదించుకుంది. గత 8 సీజన్లలో ఈ షో కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టెలివిజన్ రంగంలోనే భారీ రికార్డులను క్రియేట్ చేసిన ఈ షో ప్రస్తుతం 9 వ సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే బిగ్ బాస్ షో కి సంబంధించిన చాలా విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి… ఇంతకుముందు గత 8 సీజన్లలో బిగ్ బాస్ షో కి వాయిస్ ఇచ్చిన వారు ఎవరు అనే దానిమీద పలు రకాల చర్చలైతే జరిగాయి. మరి మొత్తానికైతే ఆయన ఎవరు అనేది పక్కన పెడితే బిగ్ బాస్ అనే ఒక బ్రాండ్ కి ఆయన వాయిస్ ఇస్తున్నాడు. కాబట్టి ఆయన వాయిస్ లోని బేస్ అవతల వాళ్ళు భయపడే రేంజ్ లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇన్ని రోజులు అతనితో వాయిస్ ఓవర్ చెప్పించారు. కానీ ఇప్పుడు అతని ప్లేస్ లో మరొకరిని తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ షో కి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకుగాను అతనికి 100 రోజులకు కలిపి 5 లక్షల రూపాయలనైతే చెల్లించారట…
Also Read: బిగ్ బాస్ 9 లో బాలయ్య బాబు హీరోయిన్ కి చోటు దక్కిందట…ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..?
మరి ప్రస్తుతం అతన్ని మార్చడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు అన్ని సీజన్లలో బిగ్ బాస్ వాయిస్ కి అలవాటు పడిపోయిన జనాలు ఇప్పుడు కొత్త వాళ్ళ చేత వాయిస్ చెప్పిస్తే ప్రేక్షకులు ఎంత వరకు కనెక్ట్ అవుతారు.
ఆ వాయిస్ లో బేస్ అలాగే ఉంటుందా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటిని సంపాదించుకున్న ఆ వాయిస్ ను పక్కనపెట్టి కొత్త వాళ్ళను దించితే అది ఎంత వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ హౌజ్ లోకి జబర్దస్త్ కమెడియన్ రాబోతున్నాడా..?
గతంలో వాయిస్ చెప్పిన ఆయన బిగ్ బాస్ షో కి వాయిస్ ఇచ్చింది నేనే అని ఓపెన్ గా చెప్పుకుంటూ జనాల్లో పబ్లిసిటీని పొందడానికి సిద్ధంగా ఉన్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే బిగ్ బాస్ షో నుంచి బిగ్ బాస్ కి వాయిస్ ఇచ్చిన అతన్ని తప్పించడం అనేది కరెక్ట్ కాదు అంటూ పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…