Bigg Boss 9 Telugu Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటులలో బాలయ్య బాబు ఒకరు…ప్రస్తుతం ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టాయనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య ఇప్పుడు ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో బాలయ్య బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులందరిని మెప్పించింది. మరి దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబు నటించిన సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా బోయపాటి శ్రీను ఆ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు.
Also Read: బిగ్ బాస్ హౌజ్ లోకి జబర్దస్త్ కమెడియన్ రాబోతున్నాడా..?
తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రేక్షకులు సైతం సినిమాలతో పాటుగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ను కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మా టీవీలో వస్తున్న బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులు చాలావరకు ఎంటర్టైన్ అవుతున్నారు…ఈ షోలో చాలామంది సినిమా సెలబ్రిటీలు పాల్గొంటుండటం విశేషం…
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు తో పాటు నటించిన ఒక టాప్ హీరోయిన్ బిగ్ బాస్ 9 లో పాల్గొనబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన ‘నరసింహ నాయుడు’ సినిమాలో నటించిన ఆశా సైని బిగ్ బాస్ షో లో పాల్గొనబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read: ‘100 % లవ్’ లో ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు క్రేజీ యంగ్ హీరోస్ లో ఒకడు..గుర్తుపట్టగలరా?
అయితే ఈ సినిమాలో బాలయ్య బాబుతో పాటు ఆమె ఆడి పాడింది. ముఖ్యంగా లక్స్ పాప లక్స్ పాప అనే పాటలో ఆడి పాడింది. ఈ ఒక పాటతో ఆమె భారీ పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ తను వస్తే తన పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలని అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…