Devara: టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మేనియా నే కనిపిస్తుంది. అరవింద సమేత చిత్రం తర్వాత దాదాపుగా ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రం ఇది. అంతే కాదు #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కూడా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాలేదు కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1.3 మిలియన్ డాలర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ‘కల్కి’ చిత్రం ప్రీమియర్స్ ట్రెండ్ కంటే ఎక్కువ ఇది.
ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండే 3 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ క్రేజ్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్లకు ఇప్పుడు ఒక చేదు వార్త. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ లోని ఒక ఓపెన్ గ్రౌండ్ ని బుక్ చేసుకున్నారు. పోలీసులు అనుమతి కోసం రెండు రోజుల క్రితమే రిక్వెస్ట్ చేసారు. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. ‘దేవర’ మంచి హైప్ తో వస్తున్న సినిమా. ఎన్టీఆర్ లాంటి అత్యంత ప్రజాధారణ ఉన్న కథానాయకుడు, ఇలాంటి హైప్ మూవీస్ కి ఓపెన్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏర్పాటు చేస్తే జనాలను అదుపు చేయడం మా వల్ల కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అనుమతిని నిరాకరించారు. వాస్తవానికి సెప్టెంబర్ 22 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యాలనే ప్లాన్ ఉండేది.
కానీ ఇప్పుడు వాయిదా పడింది. సెప్టెంబర్ 24 వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతాడని కొందరు, సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు అవుతాడని మరికొందరు, వీళ్లిద్దరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అవుతారని మరికొందరు అంటున్నారు. వీటిలో ఏది నిజమో ఇంకా ఖరారు కాలేదు. అసలు ముఖ్య అతిథులు ఎవ్వరూ రాకపోవచ్చు కూడా. ఒకవేళ వస్తే మహేష్ బాబు నే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విజయవాడ లో ఉంటున్నాడు, క్షణం కూడా తీరిక లేకుండా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ఎవరు ముఖ్య అతిథి అనే దానిపై మిస్టరీ వీడనుంది.