Nari Nari Naduma Murari Teaser Review : గత కొంతకాలం నుండి సరైన కమర్షియల్ హిట్ లేక, తన మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకునే రేంజ్ కి వచ్చిన హీరో శర్వానంద్(Sharwanand). అప్పట్లో నేచురల్ స్టార్ నాని కి పోటీ గా వచ్చిన ఈయన, భవిష్యత్తులో చాలా పెద్ద రేంజ్ కి వెళ్లాడని అంతా అనుకున్నారు. కానీ ఈమధ్య కాలం లో ఈయన చేస్తున్న ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే శర్వానంద్ కి బాగా కలిసొచ్చిన జానర్ కామెడీ. ఇప్పటి వరకు ఆయన కామెడీ జానర్ లో చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. గత కొంతకాలం నుండి ఈ జానర్ కి బాగా దూరమయ్యాడు శర్వానంద్. ఇప్పుడు మళ్లీ అదే జానర్ తో కం బ్యాక్ ఇచ్చేందుకు ‘నారి నారి నడుమ మురారి'(Nari Nari Naduma Murari Movie) చిత్రం ద్వారా వచ్చే నెల 13 న మన ముందుకు రాబోతున్నాడు.
‘సామజవరగమనా’ వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత రామ్ అబ్బవరాజు దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ఇది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ని చూసిన తర్వాత శర్వానంద్ ఈసారి చాలా గట్టిగా కొట్టబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేసే హీరో, తన తోటి ఉద్యోగి సాక్షి వైద్య తో ప్రేమలో పడుతాడు. అదే కంపెనీ కి CEO గా శర్వానంద్ మాజీ ప్రేయసి సంయుక్త మీనన్ వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?, ఈ ముగ్గురు మధ్య జరిగే సంఘటనల కారణంగా ఎలాంటి ఫన్ పుట్టింది అనేదే సినిమా బేసిక్ థీమ్ అని తెలుస్తోంది.
ఈ చిత్రం లో సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్, సునీల్ వంటి కమెడియన్స్ ఉన్నారు. ముఖ్యంగా ‘సామజవరగమనా’ లో నరేష్ కి డైరెక్టర్ ఎలాంటి హిలేరియస్ క్యారక్టర్ ఇచ్చాడో మనమంతా చూసాము. అదే డైరెక్టర్ ఈ సినిమాకు కూడా పని చేసాడు కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రం లో కూడా నరేష్ కి మంచి క్యారక్టర్ రాసి ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ ప్రేయసి, మాజీ ప్రేయసి కాన్సెప్ట్ తో రీసెంట్ గానే ‘తెలుసు కదా’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఓటీటీ లో కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది, కానీ ఇది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్, చూడాలి మరి ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది.
