Krish Jagarlamudi Sensational Comments: ఈ ఏడాది ప్రేక్షకులను,ట్రేడ్ వర్గాలను తీవ్రమైన నిరాశకు గురి చేసిన చిత్రాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుండి విడుదలైన మొట్టమొదటి చిత్రమిది. కష్టాల్లో ఉన్న సినీ ఇండస్ట్రీ ని ఈ చిత్రం కచ్చితంగా కాపాడుతుందని అనుకుంటే, సినీ ఇండస్ట్రీ ని మరింత సంక్షోభం లోకి నెట్టేసింది. డైరెక్టర్ క్రిష్ ఎప్పుడైతే ఈ సినిమా నుండి తప్పుకున్నాడో, అప్పటి నుండే ఈ చిత్రం పై అంచనాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే డైరెక్టర్ క్రిష్ పనితనం ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. ఆయనే కొనసాగి ఉండుంటే కచ్చితంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసి ఉండేది. జ్యోతి కృష్ణ చేతుల్లోకి సినిమా వెళ్లిన తర్వాత స్టోరీ లో పూర్తి గా మార్పులు చేర్పులు చేశారు.
ఈ విషయాన్నీ స్వయంగా డైరెక్టర్ క్రిష్ రీసెంట్ గా ఘాటీ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ హరి హర వీరమల్లు సినిమా స్క్రిప్ట్ మొత్తం డైరెక్టర్ మారిన తర్వాత మారిపోయింది. నేను షూట్ చేసిన ఎక్కువ భాగం ఢిల్లీ దర్బార్ లో జరిగే సన్నివేశాలు ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో మేము భారీ సెట్స్ కూడా వేసాము. AM రత్నం గారు ఖర్చుకి అసలు ఎక్కడా వెనకాడలేదు. ఎర్రకోట లోని కాస్మహల్ సెట్స్ ని చాలా భారీగా తోట తరణి గారితో వేయించాం. షాజహాన్ మయూరి సింహాసనం ని కూడా ప్రత్యేకంగా చరిత్ర ని అధ్యయనం చేసి చేయించాం. ఆయన తన భార్య కోసం అందమైన తాజ్ మహాల్ ని ఎలా అయితే నిర్మించాడో, తన మయూరి సింహాసనం ని కూడా అలాగే నిర్మించి దానిపై కోహినూర్ డైమండ్ ని పెడుతాడు’.
‘ఆ డైమండ్ విలువ, తాజ్ మహాల్ తో సమానం. ఆ తర్వాత ఔరంగజేబు దానిని స్వాధీనం చేసిన సన్నివేశాలు మీరు సినిమాలో చూసే ఉంటారు. ఆ తర్వాత దర్బార్ లోకి వచ్చిన తర్వాత ఎన్నో సన్నివేశాలను చిత్రీకరించాము, మయూరి సింహాసనం పై నిల్చొని ఔరంగజేబు కి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు, షిలౌట్ మీద నిల్చొని ఫైట్ చేసే సన్నివేశం, ఇలా అనేక సన్నివేశాలు దాదాపుగా 40 నిమిషాల వరకు చిత్రీకరించాను. కానీ అదంతా ఇప్పుడు సెకండ్ పార్ట్ కి తీసుకెళ్లారు. ఆ సన్నివేశాలు మొత్తం చాలా అద్భుతంగా వచ్చాయి, పవన్ కళ్యాణ్ గారు కూడా రిస్కీ స్టంట్స్ చాలా చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సన్నివేశాలు వింటుంటే అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకున్నాయి. క్రిష్ ఈ సినిమాని కొనసాగించి ఉండుంటే కచ్చితంగా వేరే లెవెల్ ఔట్పుట్ వచ్చేది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అంటూ సోషల్ మీడియా లో క్రిష్ మాట్లాడిన మాటలను షేర్ చేస్తూ బాధ పడుతున్నారు నెటిజెన్స్.
Shocking – Director #Krish explains the original story of #HariHaraVeeraMallu
He revealed that he shot 30–40 minutes of footage in the Delhi Darbaar, which came out extremely well and has been kept for the second part#PawanKalyan pic.twitter.com/H4MpVNV7Sb
Full interview link -…
— Vedi..VediGa… (@vedivediga) September 2, 2025