https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ఆటలో అరటిపండులా మారిపోయిన నిఖిల్ ని పెద్ద జీరోని చేసిన నాగార్జున..అయినప్పటికీ పద్దతి మార్చుకోని నిఖిల్!

వాస్తవానికి నిఖిల్ అంటే హౌస్ లో అందరికీ చాలా ఇష్టం. కానీ సోనియా చేతిలో ఆట బొమ్మలాగా మారిపోవడాన్ని చూసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అలా ఆమె చేతిలో ఆటబొమ్మ లాగ మారిన నిఖిల్ కి నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ కోటింగ్ ఇచ్చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 08:37 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నిఖిల్, టాస్కులు ఆడే విషయం లో బిగ్ బాస్ చరిత్రలోనే ది బెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో ఆయన వరుసగా మూడు సార్లు టాస్కులు గెలిచి హౌస్ కి చీఫ్ గా మారాడు. కానీ చీఫ్ గా ఇతను వ్యవహరిస్తున్న తీరుని చూస్తే, ఇతన్ని అనవసరంగా చీఫ్ ని చేసారు అని అనిపించక తప్పదు. ఎలా అయితే ఆయన టాస్కులు ఆడడంతో ది బెస్ట్ అని అనిపించుకున్నాడు, ఒక చీఫ్ గా ది వరస్ట్ కంటెస్టెంట్ అని కూడా అనిపించుకున్నాడు. ఆయన అలా వరస్ట్ గా అనిపించడానికి ముఖ్య కారణం సోనియా. ఈమె ప్రభావం నిఖిల్ మీద చాలా ఉంది. పేరుకి ఈయన చీఫ్ కానీ, నిర్ణయాలు మొత్తం సోనియావే. అందుకే ఆయన క్లాన్ లోకి రావడానికి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇష్టపడలేదు. వేరే ఛాయస్ లేక బిగ్ బాస్ వెళ్ళమంటే అయిష్టంగా నిఖిల్ క్లాన్ లోకి వెళ్లడమే తప్ప, ఆయన మీద ఇష్టంతో ఎవరు పోలేదు.

    వాస్తవానికి నిఖిల్ అంటే హౌస్ లో అందరికీ చాలా ఇష్టం. కానీ సోనియా చేతిలో ఆట బొమ్మలాగా మారిపోవడాన్ని చూసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అలా ఆమె చేతిలో ఆటబొమ్మ లాగ మారిన నిఖిల్ కి నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ కోటింగ్ ఇచ్చేసాడు. ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కు లో నిఖిల్ క్లాన్ కి ఒక కంటెస్టెంట్ ని తీసే అవకాశం రావడం తో నిఖిల్ నబీల్ ని తీసేస్తాడు. దీనిపై నాగార్జున ప్రశ్నిస్తూ ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ అనే పదానికి అర్థం తెలుసా నీకు?, నబీల్ ని తీయడం సరైన నిర్ణయం అని అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు నిఖిల్ ‘మిస్ బ్యాలన్స్ అవ్వడం వల్ల అలా జరిగింది’ అని అంటాడు. అప్పుడు నాగార్జున అలా మిస్ బ్యాలన్స్ అవ్వడానికి కారణమైన మిస్ ఎవరు అని అడుగుతాడు. అలాగే ప్రేరణ కూడా నిఖిల్ హౌస్ లో జీరో అనే ట్యాగ్ ఇస్తుంది.

    అందుకు కారణం ఆమె చెప్తూ ‘ముందు రోజు మా క్లాన్ సభ్యుల దగ్గరకు వచ్చి ఇది క్లాన్స్ మధ్య పోటీ కాదు, మన హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డు ఎంట్రీస్ కి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పాడు. పక్కరోజు మాత్రం నబీల్ ని మా క్లాన్ నుండి తొలగించి తన క్లాన్ ని కాపాడుకునే ప్రయత్నం చేసాడు. అసలు అతను ఆడుతున్నది స్ట్రాటజీ గేమా?, లేకపోతే ఎవరి వల్ల అయినా ఆయన ప్రభావితం అవుతున్నాడా? అనేది నాకు అనిపించింది’ అని అంటాడు. సీత కూడా నిఖిల్ ఆటతీరుపై చాలా నిరాశగా మాట్లాడుతుంది. నాగార్జున ఇవన్నీ నిఖిల్ కి అర్థం అయ్యేలా చెప్పి, నిన్ను నువ్వు మార్చుకో అని అంటాడు. కానీ నిఖిల్ లో ఎలాంటి మార్పు లేదు, నిఖిల్ ఒకరి వల్ల ప్రభావితమై తన గేమ్ ని నాశనం చేసుకుంటున్నాడు అని సీత చెప్తే, సోనియా ఆమె గురించి చెప్పినట్టు వచ్చి గొడవ పడుతుంది. అప్పుడు కూడా నిఖిల్ బొమ్మలాగా నిలబడి చూస్తూనే ఉన్నాడు కానీ, నోరు తెరిచి మాట్లాడలేదు. ఇదంతా చూస్తుంటే సోనియా కి నిజంగా నిఖిల్ బానిసలాగా మారిపోయాడు అని అనిపిస్తుంది.