Skanda Vs Chandramukhi 2: స్కంధ, చంద్రముఖి 2.. బాక్సాఫీస్ విజేత ఎవరంటే?

ప్రముఖ తమిళ డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో వచ్చిన మరో కొత్త సినిమా చంద్రముఖి 2. ఈ మూవీలో రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషించారు.

Written By: Suresh, Updated On : September 30, 2023 12:07 pm

Skanda Vs Chandramukhi 2

Follow us on

Skanda Vs Chandramukhi 2: రెండు మంచి సినిమాలు.. అదేనండి చంద్రముఖి 2, స్కందలు రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. లారెన్స్ నటన చంద్రముఖి సినిమాకు ఎంత పాజిటివ్ గా మారిందో.. రామ్ పోతినేని మాస్ మానియా స్కంద సినిమాకు అంతే ప్లస్ గా నిలిచింది. మరి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. దీంతో చంద్రముఖి 2, స్కందల మధ్య పోటీ నెలకొంది. మరి రెండు సినిమాల్లో హిట్ అయిన సినిమా ఏంటి? బాక్సాపీస్ దగ్గర బాస్ గా నిలిచిన సినిమా ఏంటి అనే వివరాలు చూసేద్దామా?

ప్రముఖ తమిళ డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో వచ్చిన మరో కొత్త సినిమా చంద్రముఖి 2. ఈ మూవీలో రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇంతకుముందు వచ్చిన చంద్రముఖిలో రజనీ కాంత్, జ్యోతిక పాత్రల స్థానంలో లారెన్స్, కంగనా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా వరల్డ్ వైడ్‍గా చంద్రముఖి 2 సినిమా విడుదలైంది. సుమారు రూ. 50 నుంచి 60 కోట్ల బడ్జెట్‍తో చంద్రముఖి 2 సినిమాను నిర్మించారు. చంద్రముఖి 2 సినిమా తెలంగాణలోని నైజాం ఏరియాలో రూ. 3.50 కోట్లు, రాయలసీమలోని సీడెడ్‍లో రూ. 2.1 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రూ. 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఓవరాల్‍గా తెలంగాణ, ఏపీలో చంద్రముఖి 2 మూవీకి రూ. 10.10 కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా ఫిక్స్ అయింది. ఇక వరల్డ్ వైడ్‍గా రూ. 40 నుంచి 45 కోట్ల వరకు మార్కెట్ అయినట్లు సమాచారం.

చంద్రముఖి 2 సినిమా వరల్డ్ వైడ్‍గా హిట్ కొట్టాలంటే రూ. 46 కోట్లకుపైగా రాబట్టాలి. ఈ క్రమంలో చంద్రముఖి 2 చిత్రానికి విడుదలైన తొలి రోజున రూ. 5.50 కోట్ల వరకు నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళంలో 44.64 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఉస్తాద్ రామ్ పోతినేని, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ స్కంద. ఇందులో మరో హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్ చేసింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా డైరెక్టర్ మార్క్ స్టైల్‍లో ఉందని రివ్యూలు చెబుతున్నాయి. ఇది రామ్ మాస్ రాంపేజ్ అని అభిమానులు అంటున్నారు. స్కంద సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో స్కంద చిత్రానికి రూ. 47 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అయితే స్కంద సినిమాకు విడుదలైన తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 10.57 కోట్ల షేర్, రూ. 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. నైజాం ఏరియాలో రూ. 3.23 కోట్లు వచ్చాయి. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన స్కంద చిత్రానికి రెండో రోజున కూడా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. స్కంద మూవీకి 2వ రోజు రూ. 7 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మొదటి రోజు రూ. 11.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండు రోజులకు కలిపి స్కంద సినిమాకు రూ. 18.50 కోట్ల కలెక్షన్స్ రానున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. మరి రెండు సినిమాల కలెక్షన్లు చూశారు గా.. ఇందులో బాక్సాఫీస్ కింగ్ ఎవరో కామెంట్ చేయండి..