Bigg Boss Telugu 9: 2017లో తెలుగులో బిగ్ బాస్ షో ఆరంభమైంది. ఫస్ట్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన ప్రతిభతో ఎన్టీఆర్ షోని విజయపథంలో నడిపించాడు. సినిమా కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ సీజన్ 2 నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో నాని వచ్చారు. నాని సైతం ఒక సీజన్ తో సరిపెట్టారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు? షోకి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునను స్టార్ మా రంగంలోకి దించింది. గత ఆరు సీజన్స్ నుండి ఆయన బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగార్జున హోస్టింగ్ సూపర్. అయితే రెండు మూడు సీజన్స్ నుండి ఆడియన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడం లేదు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ప్రవర్తన, ఆట తీరుపై ఆయన జడ్జిమెంట్ సరిగా ఉండటం లేదు. అసలు షో చూడకుండానే నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడని, స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడు, అనే విమర్శలు ఉన్నాయి. కొందరు కంటెస్టెంట్స్ పట్ల కఠినంగా మరికొందరి పట్ల సాఫ్ట్ గా ఆయన యాటిట్యూడ్ ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్టార్ మా నాగార్జునను తొలగించాలి అనుకున్నా.. మరో బెస్ట్ ఆప్షన్ లేదు. ఎన్టీఆర్, రానా వంటి టాలెంటెడ్ హోస్ట్స్ సిద్ధంగా లేరు. అన్ స్టాపబుల్ షోతో తన హోస్టింగ్ స్కిల్స్ బయటపెట్టిన బాలయ్య మరో బెస్ట్ ఛాయిస్. అయితే బిగ్ బాస్ ఒక కాంట్రవర్సీ షో. బాలయ్య అటు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఆయన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే. కాబట్టి ఆయన అంగీకరించకరు. ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా కాదంటే… విజయ్ దేవరకొండ సరైన ఎంపిక అవుతాడు. ఆయనకున్న బోల్డ్ ఇమేజ్ షోకి బాగా సెట్ అవుతుంది.
మరి విజయ్ దేవరకొండకు బిగ్ బాస్ హోస్టింగ్ చేసే ఆసక్తి ఉందా?.. ఈ ప్రశ్నకు గతంలో ఆయన సమాధానం చెప్పారు. సీజన్ 2కి నాని హోస్టింగ్ చేస్తున్న సమయంలో.. నాని బిగ్ బాస్ షో హోస్ట్ గా ఉన్నారు. మిమ్మల్ని భవిష్యత్ లో బిగ్ బాస్ హోస్ట్ గా చూడవచ్చా? అని అడగ్గా.. నాకు అంత సమయం లేదు. ఆసక్తి కూడా లేదు. నేను బిగ్ బాస్ షోకి హోస్టింగ్ చేయలేను. నాని గొప్పగా హోస్టింగ్ చేస్తున్నాడు. ఆయన బాగా చేస్తారని, అన్నారు. కెరీర్ బిగినింగ్ లోనే విజయ్ దేవరకొండ తనకు ఆసక్తి లేదని తేల్చేశాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కాబట్టి బిగ్ బాస్ వేదికపై హోస్ట్ గా విజయ్ దేవరకొండ కనిపించడం కష్టమే.
Also Read: రామ్ చరణ్ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంత? అది ఎవరికి ఇచ్చాడో తెలుసా?