Bigg Boss Telugu 9 Agnipariksha: తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో… ఇప్పుడు తొమ్మిదోవ సీజన్ ని స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇంతకుముందు బిగ్ బాస్ షో కి కంటెస్టెంట్ గా సెలబ్రిటీస్ ను బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసేవారు. కానీ ఈ సీజన్ కోసం మొత్తం రూల్స్ మార్చేశారు. కామన్ మైన్స్ సైతం ఇందులో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకున్నారు… ఈ షో లో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ల టాలెంట్ ను చూపిస్తూ ఒక మూడు నిమిషాల పాటు వీడియోని రికార్డు చేసి బిగ్ బాస్ టీం కి పంపిస్తే వాళ్లు ఆ వీడియోను చూసి అందులో ఎవరైతే ప్రతిభ కలిగిన వారు ఉన్నారో వాళ్లను సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష లో టాస్క్ లను పెట్టి వాటిని తట్టుకుని సక్సెస్ ఫుల్ గా నిలిచిన వాళ్ళను మాత్రమే బిగ్ బాస్ షోలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అగ్నిపరీక్ష అనే పేరుతో 45 మందికి కొన్ని టాస్క్ లను నిర్వహించి వాళ్లలో నుంచి 15 మందిని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…
Also Read: నువ్వు లేని లోకంలో ఉండలేనని.. నెలలోపే కోటా శ్రీనివాసరావు సతీమణి కన్నుమూత
ఇక రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ప్రోమో ను కూడా రిలీజ్ చేశారు…ఆ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ అగ్ని పరీక్షలో గెలిచిన 15 మంది కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది…వాళ్ల పేర్లను ఒకసారి మనం కూడా తెలుసుకుందాం…
1.అనూష రత్నం…ఈమె ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్…ఇక ఈమె కొన్ని ఈవెంట్స్ కి యాంకర్ గా కూడా చేస్తున్నారు. అలా ఈ మధ్య ఆమె యాంకరింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది…
2.దివ్య నికిత…ఈమె మూవీ రివ్యూవర్…
3. శ్వేత శెట్టి…ఈవిడ కేవలం బిగ్ బాస్ కోసమే యూకే నుంచి వచ్చారట…
4. శ్రేయ… ఈమె కూడా ఇన్ స్ట్రాగ్రామ్ ఇన్ ఫ్లూయాన్సర్ కావడం విశేషం…
5. డెమన్ పవన్…
6.ప్రసన్న కుమార్…ఈయనకి సింగిల్ లెగ్ ఉన్నప్పటికి చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి… చాలా గిన్నిస్ బుక్ రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు…
7. దమ్ము శ్రీజ…ఈవిడ కూడా ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్…ఇప్పుడిపుడే కాంట్రవర్సీ లను క్రియేట్ చేస్తున్నారు…
8.మిస్ తెలంగాణ కల్కి…మిస్ తెలంగాణ పోటీ లో రన్నరప్ గా నిలిచిన ఈమె కూడా సెలెక్ట్ అయింది…
9. చక్రవర్తి…అనే ఒక జిమ్ ట్రైనింగ్ వీడియోలను పెట్టే వ్యక్తి…ఈయనని కూడా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…
10. దాళియా షరీఫ్…
11. మాస్క్ మ్యాన్ హరీష్…
12. ఆర్మీ జవాన్ అయిన శ్రీధర్…
13.మర్యాద మనీష్…ఈయన చాలా మంచి బిజినెస్ మ్యాన్ గా తెలుస్తోంది…
14. ప్రియ శెట్టి…ఈమెను కామనర్ కింద సెలెక్ట్ చేశారు…
15. షకీబ్…ఈయన ఒక ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుస్తోంది…
మొత్తానికైతే ఈ 15 మంది అగ్నిపరీక్ష నుంచి సెలెక్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…