Bigg Boss Telugu 9 Agnipariksha Navdeep: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేపిన ‘అగ్నిపరీక్ష'(Agnipariksha) షో నిన్ననే స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టుకుంది. మొదటి ఎపిసోడ్ లో ఆశించిన రేంజ్ ఫైర్ కంటెంట్ లేదు, అలా అని పూర్తిగా బోరింగ్ గా కూడా లేదు. మీడియం రేంజ్ లో ఉంది. ఎపిసోడ్ ప్రారంభం లో వచ్చిన దివ్య, మరియు మాస్క్ మ్యాన్ ఆసక్తి కరంగా ఉన్నారు. అదే విధంగా ఎపిసోడ్ చివర్లో వచ్చిన ప్రసన్న కుమార్ అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచే వ్యక్తి అని అనిపించాడు. నిన్న టాప్ 15 కి ఎంపిక కాబడిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఇతనే. ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ జడ్జీలు ఎలా ఉన్నారు అనేది చూద్దాం. మొదటి నుండి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అభిజిత్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఎందుకో ఆయన ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యాడు అనిపించింది.
Also Read: ‘విశ్వంభర’ సరికొత్త గ్లింప్స్ అదుర్స్..కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది!
ముఖ్యంగా విజయవాడ నుండి వచ్చిన దివ్య అనే అమ్మాయి అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడానికి అర్హుడు కాడు అంటూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది. అంటే ఓట్లు వేసి గెలిపించిన జనాలను ఆమె తప్పుబట్టినట్టే కదా. బిగ్ బాస్ టైటిల్ గెలవడం అంటే సాధారణమైన విషయం కాదు, ఆమె అలా నువ్వు బిగ్ బాస్ కి అర్హత లేని వాడివి, టాస్కులు పెద్దగా ఆడలేదు, కేవలం ఒక్క ఎపిసోడ్ లో మైండ్ గేమ్ ఆడి, సీజన్ మొత్తం మైండ్ గేమ్ ఆడినట్టు కలరింగ్ ఇచ్చావు, ఇలా ఇన్ని మాటలు అన్నప్పుడు తనని తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు అభిజిత్. ఇదే జనాలకు నచ్చలేదు. నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, అది ఆమె అభిప్రాయం అని వదిలేస్తే నీకు ఓట్లు వేసి గెలిపించిన జనాలను ఏమని అనుకోవాలి? అనేదే ఆడియన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.
బిగ్ బాస్ అంటే కేవలం ఆటలు ఆడడం ఒక్కటే కాదు, మనిషి ప్రవర్తన ని చూసే జనాలు ఓట్లు వేస్తారు అనే నిజాన్ని ఆయన చెప్పలేదు. ఇక నవదీప్, బిందు మాధవి విషయానికి వస్తే, వీళ్లిద్దరు దుమ్ము దులిపేసారు అనే చెప్పాలి. ముఖ్యంగా నవదీప్ జడ్జిమెంట్ కష్టమైన సమయాల్లో చాలా బాగుంది. అంతే కాదు బోరింగ్ గా మారాల్సిన ఎపిసోడ్ ని తన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తో నిలబెట్టేసాడు కూడా. ఇక బిందు మాధవి కూడా చాలా నిర్మహోమాటంగా ముక్కుసూటి తనంతో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. అభిజిత్ కూడా అలాగే ఉన్నాడు కానీ,తన మార్కు ని ఇంకా బయటకు తీయలేదు, రాబోయే ఎపిసోడ్స్ లో తీస్తాడేమో చూడాలి. ఎవరో ఒక కంటెస్టెంట్ కి ఆయన ఫుల్ కోటింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది, ఆ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.