Beda Budaga Jangam Caste: ఏపీలో( Andhra Pradesh) కులాల మార్పు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలోకి మార్చాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది కూడా. అయితే వాటిపై దృష్టి పెట్టింది కేంద్రం. అందులో భాగంగా ఓ రెండు కులాలను ఎస్టీల్లోకి చేర్చాలన్న ప్రతిపాదనలపై కేంద్రం ప్రకటన చేసింది. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనకు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. లోక్సభలో టిడిపి ఎంపీలు కేశినేని శివనాథ్, అంబికా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి దుర్గా దాస్ ఉయికె సమాధానం ఇచ్చారు. వాల్మీకి తో పాటు బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ పంపిన ప్రతిపాదనలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇవ్వలేదని తెలిపారు.
Also Read: ‘విశ్వంభర’ సరికొత్త గ్లింప్స్ అదుర్స్..కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది!
* 2017 లో నివేదిక..
2017లో డాక్టర్ పి డి సత్యపాల్ కుమార్( doctor PD Satyapal Kumar ) ఇచ్చిన రిపోర్టు ప్రకారం వాల్మీకి, బోయలు ఏపీలో 25.80 లక్షల మంది ఉన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతూనే ఉంది. అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి కూడా పంపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే అంశంపై టిడిపి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. కానీ ఈ అంశంపై కేంద్రం తోసిపుచ్చినట్లు అయ్యింది అయితే వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో కలిపే దిశగా ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది చూడాలి.
* బేడ బుడగ జంగాలను సైతం..
నంద్యాల టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి ( baireddy Sabari ) కూడా ఇదే అంశంపై ప్రత్యేక ప్రస్తావన చేశారు. ఏపీలో బేడ బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. పార్లమెంటులో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం సంఖ్య అధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. మరోవైపు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినందుకు బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఎంపీ సబర్ కి ధన్యవాదాలు తెలిపింది.