Bigg Boss Telugu 9 Agnipariksha Bindu Madhavi: బిగ్ బాస్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన ‘అగ్నిపరీక్ష'(Agnipariksha) షో నిన్న అర్థ రాత్రి నుండి జియో హాట్ స్టార్ లో మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియా కారణంగా మనకి వచ్చిన అనేక లీక్స్ లో మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి అగ్నిపరీక్ష ని దాటుకొని బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లోకి ఎంట్రీ ఇచ్చాడు అనే విషయం కూడా మన అందరికీ తెలుసు. అయితే ‘అగ్ని పరీక్ష’ షో మొదలు అవ్వకముందే అసలు ఎవరు ఈ మాస్క్ మ్యాన్?, ఇతని కథేంటి అని తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలో కలిగింది. ప్రోమో లో కూడా ఈ మాస్క్ మ్యాన్ బాగా హైలైట్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ ఎలా అభిజిత్(Abhijeet), బిందు మాధవి(Bindu Madhavi) ఇతని రెడ్ సిగ్నల్ ఇచ్చారు కానీ, నవదీప్(Navadeep) మాత్రం ఏంటో చూద్దాం ఇతగాడి సంగతి తదుపరి రౌండ్స్ లో అని చెప్పి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు.
Also Read: ‘విశ్వంభర’ సరికొత్త గ్లింప్స్ అదుర్స్..కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది!
ప్రోమో లో చూపించినట్టుగానే ఇతను చాలా వంకరగా సమాదానాలు చెప్పాడు. ఎందుకో చూసే ఆడియన్స్ కి, జడ్జీలకు కూడా ఇతను ఎదో బిగ్ బాస్ ఆడిషన్ కోసం డిఫరెంట్ గా ఉంటే ఎంచుకుంటారు అనే భావన తో కావాలని నటించినట్టుగా అనిపించింది. ముందు మాస్క్ మ్యాన్ రాగానే యాంకర్ శ్రీముఖి అతనితో ఫన్నీ గానే డీల్ చేస్తుంది. మొహం చూపించుకుంటే మొహం మీకు లేదా? లేకపోతే మాస్క్ ఎందుకు పెట్టుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ ‘చాలా మంచి ప్రశ్న’ అని అంటాడు. అప్పుడు శ్రీముఖి ‘సక్సెస్ అయ్యేంత వరకు తన అమ్మా నాన్నలకు ముఖం చూపించకూడదు అని అనుకున్నాడేమో..అందుకే ఇలా వచ్చాడు’ అని అంటుంది. ‘కనపడని మాస్క్ పెట్టుకొని తిరిగే సమాజం లో, కనిపించే మాస్క్ పెట్టుకొని కనపడకుండా ఉండే అజ్ఞాతవాసి ని నేను’ అని అంటాడు మాస్క్ మ్యాన్.
అప్పుడు నవదీప్ ఎదో ఆడిషన్స్ కోసం తయారై వచ్చినట్టే అనిపిస్తుంది అని అంటాడు. కానీ గత ఏడేళ్ల నుండి ఆయన ఇలాగే ఉన్నాడట. పేరు హరీష్, కానీ ఆయన పెట్టుకున్న పేరు హృదయ్ మానవ్ అట. చిన్నప్పటి నుండి మంచి కోపిష్టి మనిషి అంట, తనకు కోపం వస్తే వెంటనే చూపించేస్తాడట. అది మాటల రూపం లో అయినా, చేతల రూపం లో అయినా, తన భార్య ని కొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. దీనికి బిందు మాధవి కి చాలా కోపం వచ్చింది. నీలాంటోడిని పెళ్లి చేసుకున్నందుకు పాపం ఆమెని చూస్తుంటే జాలి వేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. భార్య మీద చెయ్యి ఎత్తడం బిందు కి అసలు నచ్చలేదు, అతను మాట్లాడుతున్నప్పుడే కూర్చున్న స్థానం నుండి పైకి లేచి అతని వద్దకు వెళ్లి లూసర్ అనే బ్యాడ్జ్ మెడలో వేసింది. అతను ఉన్నంత సేపు ఈ అంశం లో చుక్కలు చూపించేసింది. బిందు మాధవి అతని పట్ల అలా ప్రవర్తించడం కరెక్టా? కాదా? అనేది ఎపిసోడ్ ని చూసిన ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలపండి.