Bigg Boss Telugu 9 Agnipariksha: ప్రేక్షుకులను ఎంతగానో ఊరించిన బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) ‘అగ్ని పరీక్ష'(Agnipariksha) ప్రోగ్రాం అర్థరాత్రి 12 గంటల సమయం నుండి మొదలైంది. 58 నిమిషాల నిడివి గల ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫన్నీ గా, కాస్త ఫైర్ మీద కూడా సాగింది. ఈ ఎపిసోడ్ లో ఇద్దరు సామాన్యులను రిజెక్ట్ చేశారు. మిగతా వాళ్ళను హోల్డ్ లో పెట్టారు, కేవలం ప్రసన్న కుమార్ అనే వ్యక్తిని మాత్రమే టాప్ 15 లోకి పంపారు. అయితే ఈ ఎపిసోడ్ లో కొంతమంది సామాన్యులు చాలా ఓవర్ యాక్షన్ చేశారు అని అనిపించింది. కొంతమంది మాత్రం ఎలాంటి మాస్క్ లేకుండా ప్రవర్తించారు అని అర్థం అయ్యింది. అందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సినది దివ్య గురించి. ఈమె తన మనసులోని మాటలను నిర్మోహతమాతంగా వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. కానీ ఎందుకో మరీ అంత నిర్మొహమాటంగా ఉండాల్సిన అవసరం ఉందా అని కూడా అనిపించింది.
Also Read: ‘విశ్వంభర’ సరికొత్త గ్లింప్స్ అదుర్స్..కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది!
కానీ ఆమె మాట్లాడిన మాటలు అభిజిత్ ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు. సోషల్ మీడియా లో ఆమె పై చాలా ఫైర్ మీద ఉన్నారు. కనిపిస్తే కొట్టేస్తారేమో, ఆ రేంజ్ లో ఉన్నారు. ఈమె స్టేజి మీదకు ఎంటర్ అవ్వడమే చాలా వెరైటీ గా ఎంటర్ అయ్యింది. నోట్లో బ్రష్ పెట్టుకొని జుట్టు ని సర్దుకుంటూ ఎదో ఇంట్లో నిద్ర లేచి హాల్ లోకి వచ్చినట్టు వచ్చేసింది. ఆమ్మో ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని మొదట్లో అనిపించింది. ఈమె విజయవాడ కి చెందిన అమ్మాయి అట. బిగ్ బాస్ అంటే మనం ఇంట్లో ఎలా ఉంటామో, అలా ఉండాలి కదా , అందుకే ఇలా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. MBBS చదువుకున్న ఈమె బిగ్ బాస్ మీద ఇష్టం తో ఆడిషన్స్ కి వచ్చిందట. సాయి పల్లవి, శ్రీలీల లాగా MBBS బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి స్టార్ సెలబ్రిటీ అవ్వాలి అనేది ఈమె లక్ష్యం అట.
ఇదంతా పక్కన పెడితే అభిజిత్ ఈమెకు చాలా కష్టమైన టాస్క్ ఒకటి ఇస్తాడు. ఇప్పుడు మేము 4 మంది ఉన్నాము. మాలో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరో చెప్పి, నచ్చని వాళ్ళని నామినేట్ చెయ్యాలి అంటే చేస్తావా అని అంటుంది. అప్పుడు ఆమె నాకు నవదీప్ అంటే చాలా ఇష్టం, అలా కామెడీ తో ఆడియన్స్ ని అలరించడం సాధారణమైన విషయం కాదు అని అంటుంది. అలాగే నాకు నచ్చని కంటెస్టెంట్ మీరే (అభిజిత్ వైపు చూపిస్తూ). బిగ్ బాస్ అంటే టాస్కులు ఆడి గెలవాలి అనే మైండ్ సెట్ తో ఉండే నాకు మీరు ఎందుకో కేవలం సోఫాలో కూర్చొని అలా సీజన్ మొత్తం సాగించినట్టుగా అనిపించింది. మైండ్ గేమ్ కూడా ఎదో ఒక్క ఎపిసోడ్ లో బాగా ఆడి సీజన్ మొత్తం మైండ్ గేమ్ ఆడినట్టు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నారు అని అంటుంది. మీరు గేమ్ మీద కాకుండా కేవలం కొంతమంది కంటెస్టెంట్స్ మీద ఫోకస్ పెట్టినట్టుగా నాకు అనిపించింది అని ముఖం మీదనే చెప్పేస్తుంది. దీనికి అభిజిత్ ఫైర్ అవుతాడేమో అని అంతా అనుకున్నారు కానీ, ఆమెని తదుపరి రౌండ్ కి క్వాలిఫై చేశాడు. కానీ ఏది ఏమైనా ఈమె తన అభిప్రాయాన్ని ఎలాంటి బెరుకు లేకుండా చెప్పినందుకు శభాష్ అనే అనాలి. ఎందుకంటే ఈమె ఓటింగ్ రాబోయే రోజుల్లో ఎదురుకోవాల్సి ఉంటుంది. అభిజిత్ ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఈమె భయం లేకుండా చెప్పిందంటే కచ్చితంగా గ్రేట్. అందుకే అభిజిత్ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనుకోవచ్చు.