Today 22 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు అమావాస్య కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంలో సమస్యలు ఎదురు అవుతాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు మనసులో నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పైన కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు ఏదైనా ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే సంయమనం పాటించాలి. మీరు వారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి వల్ల మనసు ఆందోళనగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అయితే పెద్దల సహకారంతో వీటిని పరిష్కరిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. దుబారా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దూర ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై వెళ్లకూడదు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో చేపట్టిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఉద్యోగులు లక్షాలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.. వ్యాపారులకు భాగస్వాముల నుంచి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మనుషులు ప్రశాంతంగా ఉంచుకొని పనులు పూర్తి చేసుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ప్రత్యర్థులతో విభేదాలు ఉండే అవకాశం ఉంది. విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో విషయాలు బయట వారికి చెప్పకుండా ఉండాలి. తల్లిదండ్రులు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పాత స్నేహితులను కలవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే పెద్దలను సంప్రదించాలి. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఉద్యోగులకు ఊహించని ఆదాయం రానుంది. దీంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి అండతో వ్యాపారులు విజయవంతంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణానికి ఖర్చులు పెరుగుతాయి. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించడం ఖాయం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారు ఏదైనా పని చేపడితే దానిని పూర్తి చేయాలి. లేకుంటే వేధింపులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్తవారు పరిచయం అవుతారు. వీరి వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ఆదాయం వచ్చి చేకూరుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తారు. లక్ష్యాలను పూర్తి చేయడంలో అధికారుల మద్దతు పొందుతారు. కొన్ని సమస్యల కారణంగా వ్యాపారులు అనుకున్న లాభాలు పొందలేరు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాల్లో వెళ్లకుండా మధ్యాహ్నం లో వెళ్లడం మంచిది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఎవరికైనా డబ్బు విషయంలో వాగ్దానం ఇస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా అధికారంలో నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి మద్దతు ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. గతంలో కంటే ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. డబ్బు విషయంలో ఇతరులను నమ్మకుండా ఉండాలి.