https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అమాయక చక్రవర్తిగా మిగిలిపోయిన గౌతమ్..యష్మీ వెన్నుపోటు పొడిచిందా? ప్రూఫ్స్ తో సహా దొరికిపోయారుగా!

గౌతమ్ ఎలాగో మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి, మా ఇద్దరికీ ఒక ఛాన్స్ ఇవ్వమని యష్మీ కోరుకుంటుంది. అప్పుడు గౌతమ్ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా లోపలకు రావడం నాకు పెద్ద మైనస్ అయ్యింది, నామినేషన్స్ లో ఉన్నాను, నన్ను నేను నిరూపించుకునే సమయం కదా ఇది అని అంటాడు. అప్పుడు యష్మీ నీకు ఈ వారం అన్యాయం అయితే చేయలేదు కదా, దాదాపుగా అన్ని టాస్కులు ఆడేలా చేసాము అని అంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 08:16 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గత సీజన్ టాప్ కంటెస్టెంట్ గౌతమ్ పై, ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఒక వాదన వినిపిస్తుంది. హౌస్ లోపల జరిగిన సంఘటనలు చూస్తుంటే, నిజంగానే గౌతమ్ ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఉదాహరణకి నిన్న జరిగిన సంఘటనే తీసుకుందాం. రెడ్ టీం కి రెండు ఎల్లో కార్డ్స్ రావడంతో బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ ని టీం నుండి తొలగించాలని ఆదేశిస్తాడు. అప్పుడు టీం లీడర్ యష్మీ ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని చెప్తాం బిగ్ బాస్ అని పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. ముందుగా యష్మీ అయితే నేను టాస్కుల నుండి తప్పుకోవాలని అనుకోవడం లేదు అని అంటుంది. ప్రేరణ కూడా వెనక్కి తగ్గను, నేను చీఫ్ అవ్వలేదు, మెగా చీఫ్ కూడా కాలేకపోయాను, ఈ వారం నా వైపు నుండి వెయ్యి శాతం బెస్ట్ ఇచ్చాను, కాబట్టి నేను తప్పుకునే పరిస్థితే లేదు అని అంటుంది.

    గౌతమ్ ఎలాగో మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి, మా ఇద్దరికీ ఒక ఛాన్స్ ఇవ్వమని యష్మీ కోరుకుంటుంది. అప్పుడు గౌతమ్ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా లోపలకు రావడం నాకు పెద్ద మైనస్ అయ్యింది, నామినేషన్స్ లో ఉన్నాను, నన్ను నేను నిరూపించుకునే సమయం కదా ఇది అని అంటాడు. అప్పుడు యష్మీ నీకు ఈ వారం అన్యాయం అయితే చేయలేదు కదా, దాదాపుగా అన్ని టాస్కులు ఆడేలా చేసాము అని అంటుంది. గౌతమ్ దానికి ఒప్పుకొని ఎలాంటి వాదన చేయకుండా రేస్ నుండి తప్పుకుంటాడు. కానీ రెడ్ టీం ఒక టాస్క్ గెలిచిన తర్వాత డైస్ వేసాక మూడు పాయింట్స్ వస్తుంది. యష్మీ టీం లీడర్ గా ప్రేరణ కి రెండు, గౌతమ్ కి ఒక్క పాయింట్ ఇస్తుంది, తాను మాత్రం ఏమి తీసుకోదు. అయితే బిగ్ బాస్ డైస్ ద్వారా ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు మొత్తం మెగా చీఫ్ కంటెండర్స్ గా నిలిచారు.

    ఈ చిన్న రూల్ యష్మీ కి తెలియదు, అదే విధంగా గౌతమ్ కి కూడా తెలియదు. కానీ ప్రేరణ కి ఈ విషయం తెలిసినా చెప్పదు. టేస్టీ తేజ ఆమెకి టాస్క్ ప్రారంభం అయ్యే ముందే ఈ విషయాన్ని చెప్పాడట. కానీ ప్రేరణ చెప్పలేదు, ఈ విషయం తేజ యష్మీ కి చెప్పడంతో, ఆమె వెళ్లి ప్రేరణ ని అడుగుతుంది. నీకు తెలిసి ఎందుకు చెప్పలేదు?, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయాన్ని ముందే చెప్పుంటే గౌతమ్ ని తీసేవాళ్ళం కాదు కదా అని అంటుంది. చాలా మంది యష్మీ గౌతమ్ ని వెన్నుపోటు పొడిచింది అని అంటున్నారు కానీ, ఆమె నిజంగానే తెలియక చేసిన పొరపాటు ఇది, గౌతమ్ కూడా దీనిని అర్థం చేసుకొని పెద్దగా ఏమి వాదించలేదు, కానీ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున మాత్రం ప్రేరణ ని ఈ విషయంలో తప్పుబట్టే అవకాశం ఉంది.