https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నాగార్జున హోస్టింగ్ ని దారుణంగా ట్రోల్ చేసిన నిఖిల్..పగలబడి నవ్వుకున్న కన్నడ బ్యాచ్!

గౌతమ్ కంటెండర్ రేస్ నుండి తప్పుకోవడంతో నిఖిల్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. 'జెర్సీ' చిత్రంలో నాని రైల్వే స్టేషన్ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సన్నివేశాన్ని నిఖిల్ రిపీట్ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 08:06 AM IST

    Bigg Boss Telugu 8(184)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో అత్యంత స్నేహంగా మెలిగే కొంతమంది హౌస్ మేట్స్ మధ్య ఈ వారం కొన్ని ఫిజికల్ టాస్కులు కారణంగా ఏ స్థాయిలో గొడవలు పడ్డారో మన కళ్లారా చూసాము. ముఖ్యంగా నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, నభీల్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతలా అంటే మళ్ళీ వీళ్లంతా జీవితంలో మాట్లాడుకోరేమో అనేంతలా. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వీళ్లంతా ఈ గొడవ జరిగిన పక్క రోజు ఉదయమే మామూలు అయిపోయారు. అంత ఒక చోట కూర్చొని సరదాగా జోక్స్ వేసుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో రెడ్ టీం అన్యాయంగా గౌతమ్ ని తమ టీం నుండి ఎల్లో కార్డ్ ఇచ్చి బయటకి పంపేశారు.

    గౌతమ్ కంటెండర్ రేస్ నుండి తప్పుకోవడంతో నిఖిల్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ‘జెర్సీ’ చిత్రంలో నాని రైల్వే స్టేషన్ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సన్నివేశాన్ని నిఖిల్ రిపీట్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అయితే యష్మీ తన టీం నుండి గౌతమ్ ని కావాలని మాత్రం తీయలేదు, చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల తీయాల్సి వస్తుంది. దీనికి గౌతమ్, యష్మీ ఇద్దరు బాధపడతారు. అయితే ఈ అంశంపై ఈ వీకెండ్ నాగార్జున కచ్చితంగా యష్మీ ని నిలదీస్తాడు అనే విషయాన్ని ఊహించుకుంటూ నిఖిల్ వీకెండ్ లో నాగార్జున యష్మీ ఎలా ప్రశ్నించబోతున్నాడు, దానికి యష్మీ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది అనేది ఇమిటేట్ చేసి చూపించాడు. బెడ్ రూమ్ లో పృథ్వీ, యష్మీ ముందు ఆయన ఇదంతా చేసి చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాగార్జున, యష్మీ ని విపరీతంగా ట్రోల్ చేసాడు అనే చెప్పాలి. నాగార్జున ఈ మధ్య శనివారం ఎపిసోడ్స్ ని కూడా ఫన్ ఎపిసోడ్స్ గా మార్చేస్తున్నారు. హౌస్ మేట్స్ ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ వారం కూడా అలాగే ఉంటుందిలే , అంతకు మించి ఏమి ఉండదు అనే అర్థం వచ్చేలా ఆయన ట్రోలింగ్ ఉన్నింది.

    అయితే విచిత్రం ఏమిటంటే ఈ సీన్ ని టీవీ టెలికాస్ట్ లో కట్ చేసారు. కనీసం అన్ సీన్ ఎపిసోడ్స్ లో కూడా ఇది కనిపించలేదు. కేవలం లైవ్ టెలికాస్ట్ లో ఒక్కటే కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. మన తెలుగు వాడికి(గౌతమ్) అన్యాయం చేసి వీళ్లంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ మండిపడుతున్నారు. ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి. గౌతమ్ కి అన్యాయం చేశాను అంటూ నిన్నంతా లైవ్ లో ఏడుస్తూ కూర్చున్న యష్మీ, ఇప్పుడు అదే గౌతమ్ ని వెక్కిరిస్తుంటే పగలబడి నవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.