https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టేస్టీ తేజ పై పగ పెంచేసుకున్న విష్ణుప్రియ..వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన తేజ!

టేస్టీ తేజ అవినాష్, రోహిణి కి బాగా దగ్గరై వాళ్ళతో కలిసి కామెడీ చేయడం విష్ణు ప్రియ కి అసలు నచ్చడం లేదు. ఎందుకంటే టేస్టీ తేజ తనకు దక్కాల్సిన స్పేస్ ని ఆక్రమించుకుంటున్నాడు అని పగబట్టేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 08:20 AM IST

    Bigg Boss Telugu 8(186)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా నిజాయితీగా ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో విష్ణుప్రియ కచ్చితంగా ఉంటుంది. ఈమెకు ఎలాంటి స్ట్రాటజీలు లేవు, మనసుకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకుపోతుంది అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. కానీ ఈమె కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడుతూ ముందుకెళ్తుందని టేస్టీ తేజ విషయం లో గత రెండు మూడు రోజులుగా ఈమె ప్రవర్తిస్తున్న తీరుని చూస్తుంటే అర్థం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మొన్న విష్ణు ప్రియ కి పృథ్వీ లవ్ ట్రాక్ కంటెంట్ అసలు ఇవ్వడం లేదు. దీంతో ఆమెకు కంటెంట్ సరిగా రాకపోవడం తో అవినాష్ దగ్గరకి ఒకరోజు వెళ్లి దయచేసి మీరు చేసే స్కిట్స్ లో నన్ను కూడా చేర్చుకోండి అని అంటుంది. అవినాష్ దానికి ఓకే చెప్తాడు.

    అయితే టేస్టీ తేజ అవినాష్, రోహిణి కి బాగా దగ్గరై వాళ్ళతో కలిసి కామెడీ చేయడం విష్ణు ప్రియ కి అసలు నచ్చడం లేదు. ఎందుకంటే టేస్టీ తేజ తనకు దక్కాల్సిన స్పేస్ ని ఆక్రమించుకుంటున్నాడు అని పగబట్టేసింది. మొన్నటి ఎపిసోడ్ లో టేస్టీ తేజ, అవినాష్ సరదాగా నవ్వించడానికి ఎదో చేస్తుంటే, మధ్యలో విష్ణుప్రియ వచ్చి టేస్టీ తేజ ని తిడుతుంది. అవినాష్ స్ట్రాటజీ ప్రకారం నీ ఎనర్జీ మొత్తం డౌన్ చేసేందుకే నీతో కలిసి ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, నువ్వు ఇప్పుడు వెంటనే ఆపేయకపోతే నిన్ను మన టీంలో తదుపరి టాస్కులకు పంపించము అని సీరియస్ గా అంటుంది. దీనికి టేస్టీ తేజా చాలా హర్ట్ అవుతాడు. అదే విధంగా నిన్న అవినాష్ రోహిణి కి కిచెన్ టైం పెంచేందుకు కోసం బిగ్ బాస్ వాళ్లకు ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ లో అవినాష్, రోహిణి చిన్నపిల్లలు గా మారిపోయి అల్లరి చేస్తారు. హౌస్ మేట్స్ అందరూ వాళ్ళిద్దరిని ముద్దు చేస్తూ, వాళ్ళు అడిగిన ప్రతీ పని చేసి పెడుతూ ఉంటారు. ఈ టాస్క్ లో టేస్టీ తేజ అవినాష్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ ని అందించాలని అనుకోవడం ఎందుకో విష్ణు ప్రియ కి అసలు నచ్చలేదు. తేజ దగ్గరకి వచ్చి ఎప్పుడు వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతూ ఉంటావా?, నీకంటూ సొంత మార్క్ క్రియేట్ చేసుకోకపోతే ఎలా అని అంటుందట.

    దీనికి టేస్టీ తేజతో పాటు అవినాష్, రోహిణి కూడా బాధపడతారు. ఈ అమ్మాయికి బుర్ర ఉండే మాట్లాడుతుందా లేదా, కావాలని అలా మాట్లాడుతుందా అని రోహిణి అవినాష్ తో అంటూ ఉంటుంది. ఇంతలోపే విష్ణు ప్రియ లోపలకు వచ్చి అవినాష్, రోహిణి కి క్షమాపణలు చెప్తుంది. మరి టేస్టీ తేజ కి చెప్పవా అని రోహిణి అడగగా, నేనెందుకు చెప్తాను, అది అతని పట్ల నాకు ఉన్న అభిప్రాయం అంటూ పొగరుగా సమాధానం చెప్తుంది. దానికి టేస్టీ తేజ కూడా ఫీల్ అయ్యి సీరియస్ గా తల దించుకుంటాడు. అంతేకాదు బాల్స్ బీన్ టాస్క్ లో కూడా పాపం టేస్టీ తేజ క్రింద పడినప్పుడల్లా విష్ణు ప్రియ పగలబడి నవ్వింది. టాస్క్ నుండి అవుట్ అయిపోయి వెళ్లిన తర్వాత తేజ గట్టిగా ఏడ్చేస్తాడు, మిగిలిన కంటెస్టెంట్స్ లాగా నాకు స్టామినా లేకపోయింది, అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని బాధపడుతాడు. ఇది చూసిన తర్వాత ఆడియన్స్ కి టేస్టీ తేజ ని చూసి అయ్యో పాపం అని అనిపించింది.