Bigg Boss Telugu 8: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన హరితేజ పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 1 లో ఈమె టాప్ 3 వరకు వచ్చింది. ఆ సీజన్ లో టాస్కులు ఆడడంలో కానీ, ప్రవర్తించే తీరులో కానీ హరితేజ టాప్ క్లాస్ కంటెస్టెంట్ గా నిల్చింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా ఆ సీజన్ లో నవదీప్ తో సమానంగా ఎంటర్టైన్మెంట్ పంచిన కంటెస్టెంట్ కూడా ఈమెనే. అందుకే టాప్ 3 వరకు వచ్చింది. అలాంటి కంటెస్టెంట్ వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇస్తే అంచనాలు ఉండడం సర్వ సాధారణం. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా హరితేజ అసలు ఉండడం లేదు. టాస్కులు ఊహించిన రేంజ్ లో ఆడడం లేదు, అదే విధంగా ప్రవర్తనలో కూడా మొదటి సీజన్ తో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి.
ముఖ్యంగా ఈమెలో ఉన్న అసూయ, స్వార్థం వంటి లక్షణాలను జనాలు అసలు తీసుకోలేకపోతున్నారు. కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో యష్మీ ని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, అదే విధంగా ప్రేరణ పై పీకల దాకా కోపం పెంచుకోవడం, వీళ్లిద్దరి గురించి వెనుక చేరి నోటికొచ్చిన మాటలు మాట్లాడడం, ఇలా ఒక్కటా రెండా ఈ సీజన్ లో ఈమెలో పాజిటివ్ అంశాలు భూతద్దం వేసి వెతికినా కనిపించదు. అలాగే మాట మార్చడంలో బిగ్ బాస్ హిస్టరీ లోనే ఈమెని మించిన వాళ్ళు లేరని తనని తానూ నిరూపించుకుంది. ఆమె ఎంతటి స్వార్థపరురాలు, ఎంతటి అసూయ కలిగిన వ్యక్తి అనేది నిన్నటి ఎపిసోడ్ ని చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ‘బిగ్ బాస్ ఇంటికి దారేది’ టాస్క్ లోని మొదటి లెవెల్ లో ఈమె టీం గెలుస్తుంది. రెండవ స్థానంలో యష్మీ టీం నిలుస్తుంది. అయితే గెలిచిన టీం, ఎదో ఒక టీం కి ఎల్లో కార్డు ఇవ్వాలి. ఆ టీంకి అలా రెండు ఎల్లో కార్డ్స్ ఇస్తే టాస్కు నుండి ఒకరిని తప్పించాలి. యష్మీ టీం లో యష్మీ తో పాటుగా గౌతమ్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. దీంతో యష్మీ హరితేజ వద్దకు వెళ్లి మేము ఎంతో కష్టపడి ఆడాము, రెండవ స్థానంలో వచ్చాము, మేమంతా నామినేషన్స్ లో ఉన్నాము, దయచేసి మా కష్టాన్ని గుర్తించి ఎల్లో కార్డు ఇవ్వకండి అని యష్మీ బ్రతిమిలాడుతుంది, దానికి హరితేజ ఒప్పుకోదు.
ప్రేరణ, యష్మీ అంటే ఆమెకు ఇష్టం లేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ అదే టీం లో గౌతమ్ ఉన్నాడు, గత వారం లక్ష రూపాయిలు ప్రైజ్ మనీ కట్ అయినప్పటికీ కూడా గౌతమ్ ఆమెకి నామినేషన్ షీల్డ్ ఇచ్చి కాపాడుతాడు. కనీసం ఆ విశ్వాసం కూడా చూపించలేదు, అంతే కాకుండా నిఖిల్ కష్టపడి ఆడి టీం ని గెలిపిస్తే, నేను కెప్టెన్ కి కనుక మొత్తం పాయింట్స్ నాకే కావాలి అని స్వార్థంగా అడిగి తీసుకుంటుంది. ఇవన్నీ చూసి ప్రేక్షకులు ఈమె ఇంత కన్నింగ్ గా ప్రవర్తిస్తుండేంటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంచాలక్ గా వ్యవహరిస్తున్న ఈమె, నిఖిల్ అమానుషంగా ప్రేరణ, యష్మీ పట్ల ప్రవర్తిస్తుంటే, గట్టిగా ఆపు అని కూడా చెప్పలేకపోయింది ఈమె, తోటి అమ్మాయి అయ్యుండి ఎలా అంత సైలెంట్ గా ఉండిపోయింది అని సోషల్ మీడియా లో ఈమెని నెటిజెన్స్ ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు.