https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారిపై శనీశ్వర ప్రభావం.. దీంతో వీరికి అన్నీ విజయాలే..

కొన్ని నెలల పాటు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఈ రాశి వారు బయటపడుతారు. పెరుగుతున్న రుణభారాన్ని తగ్గించుకుంటారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 2, 2024 / 08:22 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు ఉంటాయి. శనివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు త్రిపుష్కర యోగం, ఆయుష్మాన్ యోగం ఏర్పడనువంది. దీంతో కొన్ని రాశుల వారిపై శనీశ్వర ప్రభావం ఉంటుంది. దీంతో వారు ఏ పని చేపట్టినా విజయమే అవుతుంది. ఓ రాశి వారు మాత్రం శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం, వృషభం సహా 12 రాశుల ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కొన్ని నెలల పాటు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఈ రాశి వారు బయటపడుతారు. పెరుగుతున్న రుణభారాన్ని తగ్గించుకుంటారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

    వృషభ రాశి:
    ఇంటికి ప్రత్యేక అతిథి రావడంతో ఇంట్లో సందడిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సాగుతాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వ్యాపారం గురించి చర్చిస్తారు.

    మిథున రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పాత రుణాలను క్లియర్ చేస్తారు. వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం. ప్రియమైన వారితో వాగ్వాదం ఏర్పడే అవకాశం.

    కర్కాటక రాశి:
    ఈ రాశివారికి ఈరోజు అనుకోని అదృష్టం కలగనుంది. ఏ పని చేపట్టినా విజయమే అవుతుంది. వివాహ ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

    సింహారాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఉన్నత విద్య కోసందారులు పడుతాయి. పెండింగ్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది.

    కన్య రాశి:
    ఉద్యోగులకు సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికలు పడుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

    తుల రాశి:
    ఉద్యోగులు తోటి వారితో వాగ్వాదానికి దిగుతారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉల్లాసమైన వాతావరణంలో ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఎక్కువగా చెడు గురించి ఆలోచించకూడదు.

    వృశ్చిక రాశి:
    చాలా సమస్యలు పరిష్కారానికి మార్గం ఏర్పడుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఇంట్లో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. కటుంబ అవసరాలకు ఖర్చుచేస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటారు. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి.

    మకర రాశి:
    కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. సాయంత్రం స్నేహితుతలో సరదాగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    కుంభరాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఏ పని చేపట్టినా శ్రద్ధగా పూర్తి చేయాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు.

    మీనరాశి:
    ఈ రాశి వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ప్రశంసలు అందుతాయి.