https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అమాంతం పడిపోయిన విష్ణు ప్రియ ఓటింగ్.. డేంజర్ జోన్ లోకి ఇద్దరు కంటెస్టెంట్స్..మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది అతనే!

నామినేషన్స్ లోకి వచ్చిన నిఖిల్, నబీల్ టాప్ 2 ఓటింగ్స్ తో అందరికంటే భారీ లీడ్ లో ఉన్నారు. కానీ మణికంఠ, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం మరియు నైనిక మాత్రం డేంజర్ జోన్ లోనే ఉన్నట్టుగా లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నలుగురికి ఇంచుమించుగా ఒకే రేంజ్ ఓటింగ్ వస్తుందట. ఒక గంట ఒకరు లీడింగ్ లోకి వస్తే, మరో గంట మరొకరు లీడింగ్ లోకి వస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 08:26 AM IST

    Bigg Boss 8 Telugu(61)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి సోనియా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ హౌస్ లో చాలా హీట్ వాతావరణం మధ్య జరిగింది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం హౌస్ లో ఉన్నవాళ్లకు తెలియదు కానీ, నాగార్జున ఆడియన్స్ కి మాత్రం చెప్తాడు. అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు,ఏకంగా నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నామినేషన్స్ లోకి వచ్చిన నిఖిల్, నబీల్ టాప్ 2 ఓటింగ్స్ తో అందరికంటే భారీ లీడ్ లో ఉన్నారు. కానీ మణికంఠ, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం మరియు నైనిక మాత్రం డేంజర్ జోన్ లోనే ఉన్నట్టుగా లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నలుగురికి ఇంచుమించుగా ఒకే రేంజ్ ఓటింగ్ వస్తుందట. ఒక గంట ఒకరు లీడింగ్ లోకి వస్తే, మరో గంట మరొకరు లీడింగ్ లోకి వస్తున్నారు.

    ఇలా ట్రెండ్ మారుతూ ఉండడంతో ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి విష్ణు ప్రియా ఈ లీగ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ మాత్రం కాదు. ఎందుకంటే ఆమెకు బయట చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతీసారి నిఖిల్ తో సరిసమానంగా ఓటింగ్ పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఓటింగ్ ఢమాల్ అని పడిపోయింది. కారణం ఆమె గేమ్స్ సరిగా ఆడడం లేదు. ప్రతీ విషయాన్ని చాలా కామెడీ గా తీసుకుంటుంది. ఆడియన్స్ ఎంతకాలం నన్ను ఉంచితే అంతకాలం ఉంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను అనే మైండ్ సెట్లో ఉంది కానీ, ఆది గెలవాలి అనే కసి మాత్రం ఈమెలో ఇసుమంత కూడా లేదు. దానికి తోడు వారం మొత్తంలో ఈమె ఒకలాగా కనిపిస్తుంది, వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున ముందు మాత్రం చిన్న పిల్లలాగా, తింగరి అమ్మాయి లాగ ప్రవర్తిస్తుంది.

    విష్ణు ని అందరూ నచ్చి ఓట్లు వేసేందుకు ప్రధాన కారణం ఆమెలోని అమాయకత్వం. ఆ అమాయకత్వం ఇప్పుడు జనాలకు ఫేక్ అనిపించింది. అందుకే ఓట్లు వేయడం ఆపేసారు. హౌస్ లో టాప్ 5 రేంజ్ లో ఓటింగ్ ని దక్కించుకునే ఒక కంటెస్టెంట్ 5 వ వారంలోనే డేంజర్ జోన్ లోకి వచ్చిందంటే ఎంత చెత్తగా ఆడుతుందో ఆమె అభిమానులు అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె తర్వాత మణికంఠ, ఆదిత్య, నైనిక కి కూడా సరిసమానంగా బుధవారం రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గుర్లో మణికంఠ కి కాస్త ఎడ్జ్ ఉంది, ప్రస్తుతం ఓటింగ్ లైన్ లో అందరికంటే చివరి స్థానంలో నైనిక ఉంది. మిడ్ వీక్ లో ఆమె ఎలిమినేట్ అయ్యేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.