https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఇంటికి పట్టిన దరిద్రం వదిలింది అంటూ సోనియా ఎలిమినేషన్ పై విష్ణుప్రియ కామెంట్స్!

నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఈ 'తాళి' లో ఉన్న ఫుడ్ ఐటెం ని డెడికేట్ చెయ్యి అనగా, ఆమె విష్ణు ప్రియా కి పులిహోరని డేడికేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ 'విష్ణు ప్రియా కి ఎవరైనా నచ్చితే మాత్రం తెగ పులిహోర కలిపేస్తుంది. నచ్చకపోతే మాత్రం ఆమెని తట్టుకోలేరు' అని అంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 08:31 AM IST

    Bigg Boss 8 Telugu(62)

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి, బయట షోని చూసే ఆడియన్స్ కి కామన్ గా అసలు ఇష్టం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలా ఈ సీజన్ కి సోనియా అని చెప్పొచ్చు. ఈమె ఎలిమినేషన్ కోసం ఒక్క నిఖిల్, పృథ్వీ, నైనిక, మణికంఠ తప్ప హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఎదురు చూసారు. అంతకంటే ఎక్కువగా ఈమె ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూసారు. ఈమె ఎప్పుడైతే విష్ణు ప్రియా వేసుకునే బట్టల గురించి, ఆమె కుటుంబం గురించి నామినేషన్స్ సమయంలో అతి నీచంగా మాట్లాడిందో, అప్పటి నుండే ఈమె పతనం మొదలైంది. కేవలం విష్ణు ప్రియా విషయంలో మాత్రమే కాదు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి మీద ఈమె అలాగే నోరు పారేసుకుంటూ ఉండేది. అందుకే ఆడియన్స్ ఆమె నోమోనటైన్స్ లోకి రాగానే కసిగా ఓడించి బయటకి గెంటేశారు.

    వెళ్ళేటప్పుడు కూడా ఆమె మర్యాద సంపాదించుకోలేదు. నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఈ ‘తాళి’ లో ఉన్న ఫుడ్ ఐటెం ని డెడికేట్ చెయ్యి అనగా, ఆమె విష్ణు ప్రియా కి పులిహోరని డేడికేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ‘విష్ణు ప్రియా కి ఎవరైనా నచ్చితే మాత్రం తెగ పులిహోర కలిపేస్తుంది. నచ్చకపోతే మాత్రం ఆమెని తట్టుకోలేరు’ అని అంటుంది. ఇక్కడ కూడా ఆమె గురించి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది. విష్ణు ప్రియా సరదాగా ఇంట్లో ఉన్న అబ్బాయిలతో పులిహోర కలుపుతుంది కానీ, ఏనాడూ కూడా అబ్బాయిలకు మితిమీరిన హగ్గులు ఇవ్వడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం వంటివి చేయలేదు. తన లిమిట్స్ ని మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. పృథ్వీ అంటే ఆమెకి చాలా ఇష్టమైనప్పటికీ కూడా ఏ రోజు ఆమె నిఖిల్, పృథ్వీ తో సోనియా చేసినవి చేయలేదు. జనాలు ఇలాంటివన్నీ చూసారు కాబట్టే సోనియా ని అలా బయటకి నెట్టేశారు. విష్ణు ప్రియా ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు అని అందరూ అనుకున్నారు కానీ, ఆమె కూడా మనిషే కదా, ఆమెకు కూడా బాధ కోపం ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా ఆమె హౌస్ మేట్స్ తో సున్నం పెట్టుకొని పోయిందంటే ఇక ఏమి అనుకోవాలి ఆమెను?..విష్ణు ప్రియా నిన్నటి ఎపిసోడ్ ప్రారంభం లో డైనింగ్ టేబుల్ వద్ద ప్రేరణ తో కలిసి కూర్చొని అన్నం తింటూ మాట్లాడుతుంది.

    ఆమె మాట్లాడుతూ ‘ హౌస్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది..దరిద్రం వదిలిపోయింది’ అని అనగా, ‘సోనియా ఎలిమినేట్ అవ్వడమా? ‘ అని ప్రేరణ అడుగుతుంది. అప్పుడు విష్ణు ప్రియా అవును అని తల ఊపుతుంది. అప్పుడు ప్రేరణ మాట్లాడుతూ ‘ఈ నాలుగు వారాల్లో నిఖిల్ నాతో మాట్లాడింది ఈరోజు మాత్రమే. అప్పుడు విష్ణు ప్రియా మాట్లాడుతూ ‘ఆమె ఉన్నప్పుడు నేను పృథ్వీ దగ్గరకి వెళ్ళడానికి కూడా ఏదోలా అనిపించేది’ అని అంటుంది. అప్పుడు ప్రేరణ ‘ఆమె ఇంకా తన తప్పు తెలుసుకోలేదు, వెళ్ళేటప్పుడు కూడా మన మీద నిందలు వేసి వెళ్ళింది’ అని చెప్పుకొచ్చింది.