Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఈ వారం హౌస్ లో జరుగుతున్న టాస్కులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న రాత్రి జరిగిన ఎగ్స్ టాస్క్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో దీని గురించి విస్తృతంగా చర్చలు కూడా జరిగాయి. ఇదంతా పక్కన పెడితే ఈ టాస్కులో అందరూ బాగా ఆడారు, ఒక్క ఆదిత్య ఓం తప్ప. అసలు పాపం ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చాడో, అతనికి కూడా క్లారిటీ లేదు. టాస్కులు ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కానీ, ఇతని వల్ల టీం ఓడిపోయే పరిస్థితి ప్రతీసారీ వస్తుంది. ఉదాహరణకు ఈరోజు ఎగ్స్ టాస్కు లో తన క్లాన్ లో ఉన్న ఎగ్స్ ని కాపాడుకోవడం మానేసి, నిఖిల్ క్లాన్ లో ఉన్న ఎగ్స్ ని గుంజుకోవడం కోసం వెళ్తాడు.
పోనీ గుంజుకున్నాడా అంటే అది లేదు, అక్కడికి వెళ్లి పల్టీలు కొడుతూ సర్కస్ ఫీట్లు చేసాడు. అసలే గేమ్ ని గేమ్ గా ఆడని పృథ్వీ కి ఇలాంటి అవకాశం కూడా ఉంటుంది అని తెలిస్తే ఎందుకు వదులుకుంటారు. ఆ క్లాన్ వైపుకి వెళ్తాడు, ఎగ్స్ మొత్తాన్ని పోగుచేసుకొని వస్తాడు. ఆదిత్య ఓం దానిని డిఫెండ్ చేసుకోలేకపోతాడు. ఇలా గేమ్ మొత్తం ఆదిత్య ఓం కారణంగా డిస్టర్బ్ అయ్యింది. అవతల క్లాన్ కి వెళ్లి ఎగ్స్ ని గుంజుకొని వచ్చే సత్తా లేనప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లడం?, నువ్వే ఇలాంటి మార్గం చూపించిన తర్వాత పృథ్వీ రాజ్ ఊరుకుంటాడా అంటూ సోషల్ మీడియా ఆదిత్య ఓం ని నెటిజెన్స్ తిడుతున్నారు. ఆదిత్య ఓం కారణంగా ప్రేరణ, అభయ్ అందరూ గొడవకు వస్తారు, ప్రశాంతంగా, సరదాగా జరగాల్సిన గేమ్ ఆదిత్య ఓం తెలివితక్కువ పని కారణంగా చెడిపోయింది. ఇదంతా పక్కన పెడితే టాస్కు ముగిసే సమయానికి నిఖిల్ క్లాన్ వద్ద 60 గుడ్లు ఉండగా, అభయ్ క్లాన్ వద్ద 40 గుడ్లు ఉన్నాయి.
నిఖిల్ క్లాన్ కి ఎక్కువ గుడ్లు ఉండడం వల్ల, బిగ్ బాస్ అభయ్ క్లాన్ నుండి ఒకరిని గేమ్ నుండి తప్పించే అవకాశం నిఖిల్ క్లాన్ కి ఇస్తాడు. నిఖిల్ తన సభ్యులందరితో చర్చించి అభయ్ క్లాన్ లో ఉన్నటువంటి ఏకైక స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీల్ ని తప్పిస్తారు. దీంతో బిగ్ బాస్ నబీల్ ని గేమ్ కి దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించి, మిగిలిన టాస్కుకి సంచాలక్ గా వ్యవహరించాల్సిందిగా చెప్తాడు. అలా ఈ టాస్కు లో నిఖిల్ టీం సభ్యులు అద్భుతంగా ఆడి అభయ్ క్లాన్ మీద ఆధిపత్యం సాధిస్తారు. అభయ్ క్లాన్ లో యష్మీ ఫిజికల్ గా పెద్దగా స్ట్రాంగ్ కాకపోయినా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఆమె తీరు అదిరిపోయింది, చాలా ఫోకస్ గా తన టీం కోసం ఏమైనా చేసే కంటెస్టెంట్ గా యష్మీ నిలిచింది.