https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : టైటిల్ గెలిచేంత సత్తా ఉన్న విష్ణు ప్రియ..కనీసం టాప్ 5 లోకి కూడా రాలేకపోవడానికి కారణాలు ఇవే!

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా ఈ సీజన్ లో అంటే, అది విష్ణు ప్రియ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 09:48 AM IST

    Vishnu Priya

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా ఈ సీజన్ లో అంటే, అది విష్ణు ప్రియ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు ఈమెలో ఫైర్ ని చూసి కచ్చితంగా టైటిల్ కొట్టేస్తుందని అందరు అనుకున్నారు. మొదటి రెండు వారాలు ఆమె ఆట తీరు కూడా ఆ రేంజ్ లోనే ఉండేది. నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఈమెకు ఓటింగ్ ఒక రేంజ్ లో పడేది. ఒకానొక సందర్భంలో ఈమెకు నిఖిల్ కి మించిన ఓట్లు కూడా పడ్డాయి. సోనియా ఈమెని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం కూడా అప్పట్లో విష్ణు పై జనాలకు సానుభూతి కలిగించేలా చేసింది. దాని వల్ల కూడా ఆమెకు ఓటింగ్ ఆ స్థాయిలో పడిందని అంటున్నారు విశ్లేషకులు. అలా మొదటి రెండు వారాలు విష్ణు ప్రియ కి చాలా అనుకూలంగా ఉన్నింది.

    ఎప్పుడైతే ఆమె పృథ్వీ వెనుక తిరగడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి ఆమె ఓటింగ్ గ్రాఫ్ వారం వారం కి తగ్గిపోతూ వచ్చింది. విష్ణు ప్రియ ఆటని నాల్గవ వారం నుండి చూస్తే ఆమె ఆటలో మొత్తం పృథ్వీ నే కనిపిస్తాడు. అసలు ఒక్క చోట కూడా ఆమె సొంత ఆట కనిపించదు. 24 గంటలు విష్ణు పృథ్వీ వెనుక తిరగడం తప్ప, ఆమె ఆడిందేమి లేదంటూ చూసిన ఆడియన్స్ కి అనిపించింది. ఈమధ్య కాలం లో విష్ణు ప్రియ కొన్ని టాస్కులు బాగానే ఆడింది. టాస్కులు తనకి వచ్చినప్పుడు తన వైపు నుండి విష్ణు ప్రియ నూటికి నూరు శాతం ఇవ్వడం లో ఎలాంటి లోటు చేయలేదు. కానీ అవేమి జనాలకు ఈమె బాగా ఆడింది అని అనిపించేది కాదు. పృథ్వీ వెనుక తిరిగిన విషయాలు డామినేట్ చేసేది. ఫలితంగా ఆమె ఓటింగ్ గ్రాఫ్ మరింత పడిపోతూ వచ్చింది.

    మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్ అవుతుందని మొదట్లో ఈమెని చూసినప్పుడు జనాలు అనుకున్నారు. కానీ చివరికి టాప్ 5 లో ఉండేందుకు కూడా ఆమె అర్హత సంపాదించుకోలేదు. చాలా మంది అభిప్రాయం ఏమిటంటే విష్ణు కంటే యష్మీ ఇన్ని రోజులు హౌస్ లో ఉండడమే న్యాయం అని. కానీ విష్ణు లో ఉన్న మంచితనం, నిజాయితీ గల తత్త్వం, గేమ్ కోసం తన స్వభావం ని మార్చుకోలేని తీరుని జనాలు గమనించారు. అందుకే ఆమెని ఇంత దూరం తీసుకొచ్చారు. కానీ మధ్యలో ఆమె పృథ్వీ విషయంలో అంత లోతుగా వెళ్లకపోయుంటే, ఈరోజు విష్ణు ప్రియ గ్రాఫ్ వేరే లెవెల్ లో ఉండేది. బహుశా ఈమెనే టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. ఈ సీజన్ ఎలాగో ఆమెకి కలిసి రాలేదు, కానీ బయటకి వచ్చిన తర్వాత ఆమె కెరీర్ వేరే లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉండొచ్చేమో చూడాలి.