https://oktelugu.com/

Pushpa 2 Collection: యూఎస్ లో తగ్గని పుష్ప 2 జోరు, 10 మిలియన్స్ కి చేరువలో అల్లు అర్జున్ మూవీ!

పుష్ప 2 మూవీ రికార్డుల లెక్క అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ ఈ చిత్రం బ్రేక్ చేసింది. యూఎస్ లో పుష్ప 2 చిత్రానికి భారీ ఆదరణ దక్కుతుంది. పుష్ప 2 యూఎస్ వసూళ్లు $ 10 మిలియన్ మార్క్ కి దగ్గరయ్యాయి. ఇక యూఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల జాబితాలో పుష్ప 2 చేరింది.

Written By:
  • S Reddy
  • , Updated On : December 9, 2024 / 09:46 AM IST

    Pushpa 2 Collection

    Follow us on

    Pushpa 2 Collection: పుష్ప 2 వీకెండ్ ఘనంగా ముగించింది. అల్లు అర్జున్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నాలుగు రోజుల వసూళ్లు రూ. 750 కోట్లకు పైమాటే అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు మించి హిందీ, యూఎస్ లో పుష్ప 2 చిత్రానికి ఆదరణ దక్కడం విశేషం. హిందీ ఫస్ట్ డే 72 కోట్లు, సెకండ్ డే రూ. 59 కోట్లు, థర్డ్ డే రూ. 74 కోట్లు పుష్ప 2 వసూలు చేసింది. ఇవ్వన్నీ బాలీవుడ్ రికార్డు స్థాయి వసూళ్లు. బడా స్టార్స్ నటించిన హిందీ స్ట్రెయిట్ చిత్రాలను వెనక్కి నెట్టింది పుష్ప 2. కాగా ఆదివారం పుష్ప 2 హిందీ వెర్షన్ కలెక్షన్ రూ. 80 కోట్లు అని అంచనా. అంటే వీకెండ్ నాటికే పుష్ప 2 రూ. 300 కోట్ల వసూళ్లకు చేరువైంది.

    అల్లు అర్జున్ కి యూఎస్ లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ పుష్ప 2 తో ఆ బారియర్ ని బ్రేక్ చేశాడు. సింగిల్ డే లో పుష్ప 2.. రెండు మిలియన్ వసూళ్లను కూడా అందుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం పుష్ప 2 నార్త్ ఇండియా కలెక్షన్ $ 9.1 మిలియన్స్. ఇండియన్ కరెన్సీలో రూ. 77 కోట్లకు పైగా రాబట్టింది. రన్ ముగిసే నాటికి పుష్ప 2 యూఎస్ కలెక్షన్స్ ఫిగర్ భారీగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఇక యూఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితా పరిశీలిస్తే.. బాహుబలి 2($ 20.76), కల్కి 2898 AD($18.57), ఆర్ ఆర్ ఆర్($ 14.83), పుష్ప 2($9.1), సలార్ ($8.9) మిలియన్ వసూళ్లతో టాప్ 5 లో ఉన్నాయి. పుష్ప 2 ఆర్ ఆర్ ఆర్ ని బీట్ చేసినా ఆశ్చర్యం లేదు. టికెట్స్ ధరల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెస్సాన్స్ తక్కువగా ఉంది. సోమవారం నుండి వర్కింగ్ డేస్ మొదలుకానున్నాయి. ఈ క్రమంలో టికెట్స్ ధరలు తగ్గిస్తారని అంటున్నారు.

    అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన నాలుగవ చిత్రం పుష్ప 2. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్, జగపతిబాబు కీలక రోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.