https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ లో అనూహ్య మార్పులు..ఇక టైటిల్ రేస్ లోకి వచ్చినట్టే!

5 టాస్కులు జరిగిన తర్వాత గేమ్ ని ఆపేస్తాడు బిగ్ బాస్. అయితే ఈ వారం మళ్ళీ ఆ గేమ్స్ ని తిరిగి ప్రారంభిస్తాడు. మొదటి టాస్కు స్విమ్మింగ్ పూల్ లో లాక్ వేసిన టైర్స్ ని పైకి తీసుకొచ్చి ఒక క్రమపద్ధతి పెట్టడం. నిఖిల్, విష్ణు ఈ టాస్కులో పోటీ పడగా ఇద్దరూ ఓడిపోతారు. కానీ ఇద్దరు అద్భుతంగా ఆడుతారు. అయితే ఈరోజు నిఖిల్ తన క్లాన్ లో ఇప్పటి వరకు గేమ్స్ ఆడని ప్రతీ ఒక్కరికి గేమ్స్ ని ఆడే అవకాశం ఇప్పించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 08:17 AM IST

    Bigg Boss Telugu 8(60)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత వారం ఎలిమినేట్ అయిన సోనియా ప్రభావం నిఖిల్ మీద ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మనసుకి తప్పు అనిపించినా కూడా నిఖిల్ చీఫ్ గా కొన్ని నిర్ణయాలు సోనియా వల్ల తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయ్యాక నిఖిల్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. యష్మీ అతన్ని చెడగొట్టేస్తుంది, మరో సోనియా అవుతుంది అనుకున్నారు కానీ, ఆమె కూడా న్యాయంగానే వ్యవహరిస్తోంది. మొత్తం మీద నిఖిల్ క్లాన్ నిన్నటి ఎపిసోడ్ లో చాలా న్యాయబద్దంగా గేమ్స్ ఆడినట్టుగా అందరికీ అనిపించింది. ముఖ్యంగా చీఫ్ గా నిఖిల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. టాస్కులు నిఖిల్ సోనియా ఉన్నప్పుడు కూడా బాగానే ఆడేవాడు, ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఆడుతున్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకునేందుకు హౌస్ మేట్స్ కి గత వారం ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కుని నిర్వహించిన సంగతి తెలిసిందే.

    5 టాస్కులు జరిగిన తర్వాత గేమ్ ని ఆపేస్తాడు బిగ్ బాస్. అయితే ఈ వారం మళ్ళీ ఆ గేమ్స్ ని తిరిగి ప్రారంభిస్తాడు. మొదటి టాస్కు స్విమ్మింగ్ పూల్ లో లాక్ వేసిన టైర్స్ ని పైకి తీసుకొచ్చి ఒక క్రమపద్ధతి పెట్టడం. నిఖిల్, విష్ణు ఈ టాస్కులో పోటీ పడగా ఇద్దరూ ఓడిపోతారు. కానీ ఇద్దరు అద్భుతంగా ఆడుతారు. అయితే ఈరోజు నిఖిల్ తన క్లాన్ లో ఇప్పటి వరకు గేమ్స్ ఆడని ప్రతీ ఒక్కరికి గేమ్స్ ని ఆడే అవకాశం ఇప్పించాడు. ముందుగా బాల్స్ బ్యాలన్స్ టాస్కులో తన క్లాన్ నుండి యష్మీ ని పంపిస్తాడు, యష్మీ ఈ టాస్కులో గెలిచి తన సత్తా చాటుతుంది. ఆ తర్వాత బాల్స్ ని నెట్ లో వేసే టాస్కుని ఆడేందుకు ఆదిత్య ఓం ని పంపిస్తాడు, ఆయన కూడా ఈ టాస్కు గెలుస్తాడు.

    అలా తాను ఆడుతూ, టీం మొత్తాన్ని ఆడించాడు. అదే నిఖిల్ క్లాన్ లో సోనియా ఉండుంటే ఆమె చెప్పిన వాళ్ళకే అవకాశాలు ఇచ్చేవాడు నిఖిల్. కానీ ఇప్పుడు మాత్రం చీఫ్ గా ఎంతటి సరైన నిర్ణయం తీసుకున్నాడో చూడండి. సోనియా ఉన్నంత కాలం నిఖిల్, పృథ్వీ, సోనియా ఈ ముగ్గురు మాత్రమే ఆ క్లాన్ లో టాస్కులు ఆడేవారు. మిగిలిన సభ్యులు క్లాన్ లో ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే. అలాంటి పరిస్థితి ఉండేది. అలాగే గత వారం లో కాంతారా టీం నుండి ఒకరిని తీసేయాలి అని బిగ్ బాస్ నిఖిల్ ని అడిగినప్పుడు, నిఖిల్ కాంతారా టీం లో గేమ్స్ బాగా ఆడే నబీల్ ని తొలగిస్తాడు. ఇక్కడ కూడా సోనియా నిర్ణయానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహరించాడు . కానీ ఇప్పుడు మాత్రం కిరాక్ సీత ని ఆ టీం నుండి తప్పించి సరైన నిర్ణయం తీసుకున్నాడు. దానికి కారణం చెప్తూ ఆ టీం లో ఉన్నవారంతా నామినేషన్స్ లో ఉన్నారు ఒక్క సీత తప్ప, వాళ్లకు గేమ్ ఆడి తమని తాము నిరూపించుకునే అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు నిఖిల్. ఒక లీడర్ ఎలా అయితే ఆలోచిస్తాడో, ఆ లక్షణాలన్నీ నిన్న నిఖిల్ లో కనిపించాయి, ఇదే ఫ్లోలో ఆయన కొనసాగుతూ ముందుకుపోతే కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు.