https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఈ ఆదివారం హౌస్ లోకి అడుగుపెడుతున్న 8 వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది!

బిగ్ బాస్ 7 వ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన కంటెస్టెంట్స్ లో ఒకరు ఈయన. ముఖ్యంగా ఇతన్ని సీక్రెట్ లోకి పంపించి, మళ్ళీ హౌస్ లోకి 'అశ్వథామ 2.0' గా అడుగుపెట్టిన తీరు ఆడియన్స్ కి గూస్ బంప్స్ ని రప్పించింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 08:27 AM IST

    Bigg Boss Telugu 8(61)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ లోపలకు అడుగుపెట్టబోతున్నారు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. మొత్తం 8 మంది రాబోతున్నారని టాక్ నడుస్తుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది. బుధవారం రోజు ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈ ఎపిసోడ్ మనకి టీవీ లో గురువారం రోజు టెలికాస్ట్ చేస్తారు. ఇంకో కంటెస్టెంట్ ఆదివారం కాకుండా శనివారం రోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారట. ఆదివారం రోజు కేవలం వైల్డ్ కార్డు ఎంట్రీలు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది. ఇది వరకే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేది సోషల్ మీడియా లో మీరందరు చూసే ఉంటారు. కానీ చివరగా ఖరారు అయినా కంటెస్టెంట్స్ మాత్రం వీళ్ళే.

    1) గౌతమ్ కృష్ణ : బిగ్ బాస్ 7 వ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన కంటెస్టెంట్స్ లో ఒకరు ఈయన. ముఖ్యంగా ఇతన్ని సీక్రెట్ లోకి పంపించి, మళ్ళీ హౌస్ లోకి ‘అశ్వథామ 2.0’ గా అడుగుపెట్టిన తీరు ఆడియన్స్ కి గూస్ బంప్స్ ని రప్పించింది. టాస్కులు అద్భుతంగా ఆడగలదు, హౌస్ లో ప్రతీ విషయంపై క్లారిటీ గా మాట్లాడగలడు. ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా అడుగుపెట్టబోతున్నాడు.ఈసారి ఇతను ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

    2) ముక్కు అవినాష్ : బిగ్ బాస్ సీజన్ 4 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన అవినాష్, ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రాబోతుండడం గమనార్హం. ఇతను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అవినాష్ లేని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం స్టార్ మా ఛానల్ లో ఈమధ్య ఉండడం లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. మరి ఈ సీజన్ లో ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి.

    3) గంగవ్వ : సీజన్ 4 లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగిన గంగవ్వ, హౌస్ లో వాతావరణం తట్టుకోలేక మధ్యలోనే నాగార్జున ని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయింది. అలాంటి ఆమెని మళ్ళీ ఈ సీజన్ లోకి తీసుకొస్తున్నారు. ఆమె ఆరోగ్యానికి ఏ చిన్న సమస్య వచ్చిన బిగ్ బాస్ టీం బాధ్యత అని చెప్పొచ్చు.

    4) నయనీ పావని : గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఈ అమ్మాయి, ఈ సీజన్ లో కూడా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈసారైనా మొదటి వారమే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటుందో లేదో చూడాలి.

    5) టేస్టీ తేజా: గత సీజన్ లో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా అందించిన కంటెస్టెంట్స్ లో ఒకడు ఈయన. 9 వారాలు హౌస్ లో కొనసాగిన ఈయన, సరిగ్గా ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యాడు. మరి ఈసారి అయినా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాడో లేదో చూడాలి.

    6) రోహిణి : సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగిన ఈమె, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అనేక టీవీ షోస్ లో, వెబ్ సిరీస్ లలో, సినిమాల్లో కనిపిస్తూ మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇప్పుడు ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇక ఎంట్రీ మామూలు రేంజ్ లో ఉండదు.

    7) హరి తేజ : సీజన్ 1 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరు ఈమె. టాస్కులు బాగా ఆడడంతో పాటు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో కూడా ఈమెకు ఈమెనే సాటి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె, రీసెంట్ గా విడుదలైన ‘దేవర’ చిత్రం లో కూడా కనిపించింది. ఈమె కూడా ఇప్పుడు హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది.

    8) మెహబూబ్ : సీజన్ 4 లో టాస్కులు అద్భుతంగా ఆడుతూ 8 వారం లో ఎలిమినేట్ అయిన మెహబూబ్ కూడా ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నాడట. బయటకి వచ్చిన తర్వాత ఈయన కూడా మంచి క్రేజ్ ని సంపాదించాడు. ఈసారి టాప్ 5 లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.