Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి శేఖర్ బాషా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నది రెండు వారాలు అయినా ప్రేక్షకులకు బోలెడన్ని జోకులను పరిచయం చేసి వెళ్ళాడు శేఖర్ బాషా. కేవలం ఒక్క వారం లోనే ఆయన 120 జోకులు ఆడియన్స్ కి అందించాడు. అవి మనకి తెలిసిన జోకులు మాత్రమే. కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నాన్ స్టాప్ గా జోకులు వేస్తూనే ఉన్నాడు. కేవలం ఒక్క ఆదిత్య ఓం కే 450 కి పైగా జోక్స్ వినిపించాడట. ఆయన అదే రేంజ్ ఫామ్ ని కొనసాగించి ఉండుంటే, నేడు బిగ్ బాస్ హౌస్ లోనే కొనసాగి ఉండేవాడు. కానీ రెండవ వారం శేఖర్ బాషా ఎమోషనల్ గా బాగా డౌన్ అయిపోయాడు. తన భార్య గర్భం దాల్చడం, 14 వ తేదీ డెలివరీ ఉండడం తో ఆయన డల్ గా కూర్చున్నాడు. కంటెస్టెంట్స్ ఎవ్వరితో కూడా ఆయన సరిగా మాట్లాడలేదు. ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని వ్యక్తి, సోషల్ మీడియా లో మిగతా కంటెస్టెంట్స్ లాగా పీఆర్ టీమ్స్ లేని వ్యక్తి, ఒక్కసారిగా ఇలా డౌన్ అయ్యి ఆడియన్స్ తో కనెక్షన్ కోల్పోతే కచ్చితంగా ఓట్లు పడవు, ఎలిమినేట్ అయిపోతారు, అదే శేఖర్ బాషా విషయం లో కూడా జరిగింది.
కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శేఖర్ బాషా కంటే ఆదిత్య ఓం కి తక్కువ ఓట్లు వచ్చాయి. బిగ్ బాస్ టీం కావాలని శేఖర్ బాషా ని తొలగించింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే శేఖర్ బాషా వెళ్ళేటప్పుడు నాగార్జున ఒక చిన్న టాస్కు ఇస్తాడు. ఒక్క బోర్డు మీద రియల్, ఫేక్ అనే రెండు క్యాటగిరీలు పెట్టి, ఫేక్ ఎవరు, రియల్ ఎవరో ఆ బోర్డు మీద తగిలించామని నాగార్జున అంటాడు. ఈ టాస్కులో శేఖర్ బాషా విష్ణు ప్రియా, కిరాక్ సీత మరియు ప్రేరణ ని రియల్ క్యాటగిరీలో వేయగా, సోనియా, నాగ మణికంఠ మరియు ఆదిత్య ఓం ని ఫేక్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వేస్తాడు.
ముందుగా సోనియా గురించి మాట్లాడుతూ ‘సోనియా నవ్వు చూసేందుకు చాలా అందంగా ఉంటుంది..కానీ ఆమెలోని మహంకాళి ని నామినేషన్స్ సమయం లో చూసాను, నాకెందుకో ఆమె రియల్ బయటపెట్టలేదు అని అనిపించింది’ అంటూ చెప్పుకొస్తాడు శేఖర్ బాషా. అలాగే నాగ మణికంఠ గురించి మాట్లాడుతూ ఇతను ఫేక్ ముఖం వేసుకొని ఆడడమే స్ట్రాటజీ గా పెట్టుకున్నాడు అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఇక చివర్లో ఆదిత్య ఓం గురించి మాట్లాడుతూ ‘నన్ను నామినేట్ చేసినప్పుడు నేను చాలా సరదాగా తీసుకున్నాను, కానీ అతను మాత్రం చాలా వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఆ ఫ్లోలో ఆయన పలు మాటలు జారాడు, అది నాకు చాలా బాధని కలిగించింది’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.